Advertisementt

సినీజోష్‌ రివ్యూ: నూతిలో కప్పలు

Sun 12th Apr 2015 08:35 AM
noothilo kappalu review,rajendra prasad,manas,bharath bhushan,chanti gnanamani  సినీజోష్‌ రివ్యూ: నూతిలో కప్పలు
సినీజోష్‌ రివ్యూ: నూతిలో కప్పలు
Advertisement
Ads by CJ

పోల్‌స్టార్‌ పిక్చర్స్‌

నూతిలో కప్పలు

నటీనటులు: డా॥ రాజేంద్రప్రసాద్‌, మానస్‌, భరత్‌భూషణ్‌,

విజయ్‌సాయి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: మోహన్‌ కాంత్‌

సంగీతం: సాయికార్తీక్‌, సుభాష్‌

ఎడిటింగ్‌: వినయ్‌

నిర్మాతలు: విజయ్‌, పూనాటి శ్రీను

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంటి జ్ఞానమణి

విడుదల తేదీ: 11.04.2015

ప్రస్తుతం నడుస్తున్న హార్రర్‌ సినిమాలు, యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ ట్రెండ్‌కి భిన్నంగా ఫ్రెండ్‌షిప్‌ని కథాంశంగా ఎంచుకొని పోల్‌స్టార్‌ పిక్చర్స్‌ సంస్థ ‘నూతిలో కప్పలు’ అనే చిత్రాన్ని నిర్మించింది. డా॥ రాజేంద్రప్రసాద్‌, మానస్‌, భరత్‌ భూషణ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి చంటి జ్ఞానమణి దర్శకత్వం వహించారు. యూత్‌ని టార్గెట్‌ చేస్తూ రూపొందిన ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌కి రీచ్‌ అయింది? ఫ్రెండ్‌షిప్‌ అనే కాన్సెప్ట్‌ ఎంతవరకు కనెక్ట్‌ అయింది అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: రవి(మానస్‌), శ్రీను(భరత్‌భూషణ్‌), బుజ్జి(విజయ్‌సాయి). ఈ ముగ్గురూ ప్రాణ స్నేహితులు. స్నేహాన్ని మించిన బంధం ప్రపంచంలో మరొకటి లేదని ఈ ముగ్గురి అభిప్రాయం. ఈ ముగ్గురూ స్నేహానికి ఇచ్చిన ప్రాధాన్యత వారి కెరీర్‌కి గానీ, వారి తల్లిదండ్రులకు గానీ ఇవ్వరు. అలాంటి సిట్యుయేషన్‌లో వున్న ఈ ముగ్గురి స్నేహానికి రాజేంద్రప్రసాద్‌ క్యారెక్టర్‌ ద్వారా బ్రేక్‌ పడుతుంది. వారి స్నేహాన్ని బ్రేక్‌ చేయాల్సిన అవసరం రాజేంద్రప్రసాద్‌కి ఏమిటి? ఈ ముగ్గురూ విడిపోవడానికి కారణం ఏమిటి?  అనేది మిగతా కథ. 

ప్లస్‌ పాయింట్స్‌: రాజేంద్రప్రసాద్‌ చేసిన క్యారెక్టర్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌గా చెప్పుకోవచ్చు. మహాభారతంలోని శకుని తరహాలో వుండే క్యారెక్టర్‌లో రాజేంద్రప్రసాద్‌ అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారని చెప్పాలి. ఆయన కాస్ట్యూమ్స్‌ రిచ్‌గా వుంటూ చాలా స్టైలిష్‌గా కనిపించారు. రవి క్యారెక్టర్‌లో మానస్‌ తనదైన స్టైల్‌లో మంచి నటన కనబరిచాడు. ఈ సినిమాలో మానస్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఒన్‌ ఆఫ్‌ ది హైలైట్‌ అయింది. డిఫరెంట్‌ షేడ్స్‌ వున్న రవి క్యారెక్టర్‌ని చాలా పర్‌ఫెక్ట్‌గా చేశాడు. శ్రీను క్యారెక్టర్‌ చేసిన భరత్‌భూషణ్‌కి మంచి మాస్‌ లుక్‌ వుంది. మంచి ఎనర్జీతో చేసిన అతని క్యారెక్టర్‌ మాస్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయింది. ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపించిన మనోజ్‌ నందం సినిమాని టర్న్‌ చేశాడు. ఈ సినిమాకి రవిబాబు వాయిస్‌ ఓవర్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ అయింది. 

మైనస్‌ పాయింట్స్‌: డైరెక్టర్‌ ఎంచుకున్న కాన్సెప్ట్‌ మంచిదే అయినప్పటికీ దాన్ని ఆడియన్స్‌కి పర్‌ఫెక్ట్‌గా కనెక్ట్‌ చెయ్యడంలో సక్సెస్‌ కాలేకపోయాడు. ఫాదర్స్‌ క్యారెక్టర్స్‌ చాలా వీక్‌గా వుండడం వల్ల ఏ సీన్‌లోనూ అనుకున్నంత ఎఫెక్ట్‌ రాలేదు. తండ్రీ కొడుకుల మధ్య నడిచే సీన్స్‌ ఆకట్టుకునేలా లేకపోవడంతో ఆడియన్స్‌కి చాలా సందర్భాల్లో బోర్‌ కొడుతుంది. ఈ సినిమాకి మెయిన్‌ మైనస్‌ పాయింట్‌ గ్లామర్‌. యూత్‌ని ఎట్రాక్ట్‌ చెయ్యడానికి సినిమాలో గ్లామర్‌ తప్పనిసరి అనేది డైరెక్టర్‌ గ్రహించినట్టు లేడు. కథ మీద, తను అనుకున్న కానెప్ట్‌ మీద పెట్టిన శ్రద్ధ గ్లామర్‌ మీద పెట్టలేదు. ఈ చిత్రంలోని పాటలు అంతంత మాత్రంగానే వున్నాయి. రాజేంద్రప్రసాద్‌ పాడిన పాట మాత్రం కొంచెం హార్ట్‌ టచ్చింగ్‌గా అనిపిస్తుంది. ఇక రీరికార్డింగ్‌ ఒక హోరులా వుంది తప్ప ఆకట్టుకునేలా లేదు. 

విశ్లేషణ: ‘నూతిలో కప్పలు’ యూత్‌ని ఆలోచింపజేసే సినిమా అందులో డౌట్‌ లేదు. అయితే డైరెక్టర్‌ చంటి జ్ఞానమణి ప్రస్తుతం యూత్‌ ఎలా వుంది, వారి జీవన విధానం ఎలా వుంది అనే విషయాన్ని చాలా డీప్‌గా వెళ్ళి డిస్కస్‌ చెయ్యడం వల్ల  ఆడియన్స్‌ని అంతగా ఆకట్టుకోలేదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడిరచి క్రిస్ప్‌గా చెప్పి వుంటే ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యేది. అయితే క్లైమాక్స్‌లో ఇచ్చే మెసేజ్‌ సినిమాకి హైలైట్‌ అని చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే ‘నూతిలో కప్పలు’ యూత్‌కి మెసేజ్‌ని అందించే ఎంటర్‌టైనర్‌. అయితే ఇందులో ఆడియన్స్‌ని ఆకట్టుకునే గ్లామర్‌, పాటలు, కామెడీ అనుకున్నంత లేకపోవడం వల్ల ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకాదరణ పొందుతుంది, ఏమేర వారికి కనెక్ట్‌ అవుతుందనేది వేచి చూడాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: గ్లామర్‌ లేని యూత్‌ మూవీ

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ