Advertisementt

సినీజోష్‌ రివ్యూ: ఓ చెలియా నా ప్రియ సఖియా

Sun 05th Jul 2015 03:00 PM
telugu movie o cheliya naa priya sakhiya review,cinejosh review o cheliya naa priya sakhiya,hero manoj nandam,smithika,monika singh  సినీజోష్‌ రివ్యూ: ఓ చెలియా నా ప్రియ సఖియా
సినీజోష్‌ రివ్యూ: ఓ చెలియా నా ప్రియ సఖియా
Advertisement
Ads by CJ

కమలేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌

ఓ చెలియా నా ప్రియ సఖియా

నటీనటులు: మనోజ్‌ నందం, స్మితిక, మోనిక సింగ్‌,

కొండవలస, తులసిరెడ్డి తదితరులు

సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.శివారెడ్డి

సంగీతం: సాకేత్‌ నాయుడు

ఎడిటింగ్‌: రమేష్‌

సమర్పణ: పసుపుల సోమిరెడ్డి

కథ: వెంకట్‌

రచన, నిర్మాత, దర్శకత్వం: పి.రమేష్‌ బాబుల్‌రెడ్డి

విడుదల తేదీ: 03.07.2015

మనోజ్‌ నందం, స్మితిక, మోనిక సింగ్‌ ప్రధాన పాత్రల్లో పి.రమేష్‌ బాబుల్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. ప్రేమలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులకు చెప్పాలనుకున్న ఆ కొత్త పాయింట్‌ ఏమిటి? మనోజ్‌ నందంకి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది? యూత్‌ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రం ఏమేమి వున్నాయి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: కెరీర్‌లోనే కాదు ప్రేమలోనూ బెటర్‌మెంట్‌ కోసం ట్రై చేసే ఓ యువకుడు మురళి(మనోజ్‌ నందం) కథ ఇది. తనకి ప్రతిరోజూ కలలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తూ వుంటుంది. ఆ అమ్మాయి ఎక్కడ తారస పడుతుందా అని ఎదురుచూస్తుంటాడు. ఎదుటివారికి మనకు చేతనైన సాయం చెయ్యాలన్న మనస్తత్వం వున్నవాడు మురళి. అలాంటి మనస్తత్వమే వున్న మరో అమ్మాయి కావ్య(స్మితిక). పరిస్థితులు, తనకు ఎదురైన సంఘటనల కారణంగా మురళిని అపార్థం చేసుకుంటుంది కావ్య. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఫ్రెండ్స్‌గా కొనసాగుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ వుంటుంది కానీ, బయటపడరు. ఒక సందర్భంలో తన ఫ్రెండ్స్‌ ఎంకరేజ్‌మెంట్‌తో కావ్యకి లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు మురళి. కావ్య ఫ్రెండ్స్‌ మాత్రం లవ్‌ ప్రపోజ్‌ చెయ్యగానే వెంటనే ఒప్పుకోవద్దని, బెట్టు చెయ్యాలని కావ్యకి సలహా ఇస్తారు. మురళి లవ్‌ ప్రపోజ్‌ చెయ్యగానే తనకి అలాంటి ఉద్దేశం లేదని, తను ఫ్రెండ్‌గానే ఫీల్‌ అవుతున్నానని చెప్తుంది కావ్య. దాన్ని సీరియస్‌గా తీసుకున్న మురళి తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, లవ్‌లో తనకు ఆ అమ్మాయి బెటర్‌మెంట్‌ అని చెప్తాడు. నిజంగానే మురళిని లవ్‌ చేసిన కావ్య అతని సమాధానంతో షాక్‌ అవుతుంది. మురళి నిజంగానే కావ్యని ప్రేమించలేదా? అతను ప్రేమించిన మరో అమ్మాయి ఎవరు? మురళిపై తనకున్న ప్రేమని బయట పెట్టలేకపోయిన కావ్య తర్వాత ఏం చేసింది? లవ్‌లో బెటర్‌మెంట్‌ వెతుక్కున్న మురళికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? చివరికి మురళి, కావ్య కలుసుకున్నారా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: లవ్‌లో బెటర్‌మెంట్‌ని కోరుకునే కుర్రాడిగా మనోజ్‌ నందం పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదు. అతను గతంలో చేసిన సినిమాల్లోలాగే అతని పెర్‌ఫార్మెన్స్‌ వుంది తప్ప కొత్తగా ఏమీ అనిపించదు. రకరకాల ఎమోషన్స్‌లో మంచి నటనను కనబరిచింది కావ్యగా నటించిన స్మితిక. బెటర్‌మెంట్‌ లవర్‌ నిమిగా నటించిన మోనిక సింగ్‌ ఓకే అనిపించింది. ఈ ఇద్దరు హీరోయిన్లు అక్కడక్కడా తమ గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. హీరో బ్యాచ్‌ వుండే ఇంటి ఓనర్‌గా కొండవలస చాలా రొటీన్‌ క్యారెక్టర్‌ చేశాడు. తన క్యారెక్టర్‌ ద్వారా కొంత కామెడీ చెయ్యాలని చూశాడు కానీ, వర్కవుట్‌ అవ్వలేదు. కావ్య తాతయ్యగా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి ఈ చిత్రంలో నటించడం విశేషంగా చెప్పుకోవాలి. కనిపించింది కొన్ని సీన్లలో అయినా తన క్యారెక్టర్‌కి న్యాయం చేశారు తులసిరెడ్డి. 

టెక్నీషియన్స్‌: చిత్రానికి ప్రధాన టెక్నీషియన్స్‌లో ఒకరైన సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.వి.శివారెడ్డి ఆద్యంతం మంచి ఫోటోగ్రఫీ అందించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పాటల్ని, హీరోయిన్ల గ్లామర్‌ని చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. రమేష్‌ ఎడిటింగ్‌ ఇంకా బెటర్‌గా వుంటే బాగుండేది. సెకండాఫ్‌లో చాలా ల్యాగ్‌ వుంది. దాన్ని కట్‌ చేస్తే సినిమా కొంత స్పీడ్‌ అయ్యేది. ఈ చిత్రం ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇంట్రడ్యూస్‌ అయిన సాకేత్‌ నాయుడు తన మొదటి చిత్రంలోనే మంచి మ్యూజిక్‌ ఇవ్వడానికి ట్రై చేశాడు. రెండు పాటలు బాగున్నాయి. విజువల్‌గా కూడా పాటల్ని బాగా తీశారు. సాకేత్‌నాయుడు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఫర్వాలేదు అనిపించింది. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండిరగ్‌ వరకు హీరో, హీరో ఫ్రెండ్స్‌.. హీరోయిన్‌, హీరోయిన్‌ ఫ్రెండ్స్‌.. ఇలా సినిమా మొత్తం వాళ్ళనే చూపించడం వల్ల ఆడియన్స్‌కి బోర్‌ కొట్టే అవకాశం వుంది. లవ్‌లో బెటర్‌మెంట్‌ కోరుకునే కుర్రాడి గురించి చెప్పారు. ఆ కుర్రాడు జీవితంలో బెటర్‌మెంట్‌ కోసం కూడా ట్రై చేసి సక్సెస్‌ అయినట్టు చూపిస్తే బాగుండేది. 

విశ్లేషణ: డైరెక్టర్‌ అనుకున్న పాయింట్‌ చాలా చిన్నది. రెండు గంటల పాటు ఆడియన్‌ని కూర్చోబెట్టాలంటే దానికి స్పీడ్‌గా వుండే కామెడీని కూడా జోడిస్తే బాగుండేది. కానీ, సినిమా అంతా అమ్మాయిలు మాట్లాడుకునే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షించారు. ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో, హీరోయిన్‌ ఒకరినొకరు కలుసుకోవడానికి టైమ్‌ తీసుకోవడం, ఆ తర్వాత హీరోయిన్‌ తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్‌ చెయ్యడానికి మూడు సినిమా చాప్టర్‌లు ఉపయోగించడం, ఇంటర్వెల్‌కి వచ్చేసరికి తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్‌ చెయ్యలేకపోవడంతో అక్కడ స్టోరీ లాక్‌ అయిపోతుంది. ఆ తర్వాత సెకండాఫ్‌ ఎండిరగ్‌ వరకు ఎలాంటి దానికి సొల్యూషన్‌ వుండదు. క్లైమాక్స్‌ వరకు అనవసరమైన సీన్స్‌తో నడిపించి క్లైమాక్స్‌లో లవ్‌లో బెటర్‌మెంట్‌ కోసం చూడకూడదని రియలైజ్‌ అయినట్టు చూపించడంతో కథ సుఖాంతమవుతుంది. తను అనుకున్న పాయింట్‌ బాగానే వున్నా, దాని చుట్టూ అల్లుకున్న సీన్స్‌లో సత్తా లేకపోవడంతో ఆ పాయింట్‌ ఫ్రెష్‌నెస్‌ని కోల్పోయింది. సినిమా మొత్తంలో మనకు ఎక్కువగా కనిపించేది హీరో, హీరోయిన్‌, వారి ఫ్రెండ్స్‌. పైగా రిపీటెడ్‌ సీన్స్‌ వుండడంతో ల్యాగ్‌ ఎక్కువైంది. ఫైనల్‌గా చెప్పాలంటే చక్కని ఫోటోగ్రఫీ, మంచి మ్యూజిక్‌, హీరోయిన్ల గ్లామర్‌, యూత్‌కి ఇచ్చిన ఒక మెసేజ్‌ కోసం ఈ సినిమా చూడాలనుకునే వారు చూడొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: బెటర్‌మెంట్‌ అవసరం

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ