Advertisementt

సినీజోష్‌ రివ్యూ: కొలంబస్‌

Thu 22nd Oct 2015 09:11 PM
telugu movie columbus review,columbus movie cinejosh review,seerath kapoor in columbus,columbus director r.samala  సినీజోష్‌ రివ్యూ: కొలంబస్‌
సినీజోష్‌ రివ్యూ: కొలంబస్‌
Advertisement
Ads by CJ

ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 

కొలంబస్‌ 

తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, సీరత్‌కపూర్‌, మిస్టీ చక్రవర్తి, 

రోషన్‌, సప్తగిరి, నాగినీడు, రోహిణి, పృథ్వీ తదితరులు 

సంగీతం: జితిన్‌ రోషన్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: జె.బి. 

సినిమాటోగ్రఫీ: భాస్కర్‌ సామల 

ఎడిటింగ్‌: కె.వి.కృష్ణారెడ్డి 

నిర్మాత: అశ్వనికుమార్‌ సహదేవ్‌ 

కథ, స్క్రీన్‌ప్లే, సూపర్‌విజన్‌: యం.యస్‌.రాజు 

మాటలు, దర్శకత్వం: ఆర్‌.సామల 

విడుదల తేదీ: 22.10.2015 

తూనీగ తూనీగ చిత్రంతో హీరోగా పరిచయమైన సుమంత్‌ అశ్విన్‌ ఆ తర్వాత చేసిన అంతకుముందు ఆ తరువాత, కేరింత చిత్రాలు కమర్షియల్‌గా అంత సక్సెస్‌ అవ్వకపోయినా ఓకే అనిపించాయి. తాజాగా ఎకెఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆర్‌.సామల ను దర్శకుడుగా పరిచయం చేస్తూ అశ్వనికుమార్‌ సహదేవ్‌ నిర్మించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కొలంబస్‌. ఈ చిత్రానికి యం.యస్‌.రాజు కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవర్‌బోయ్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్న సుమంత్‌ అశ్విన్‌కి ఈ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ని అందించిందా? యం.యస్‌.రాజు కథ, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ యూత్‌ని ఎంతవరకు ఆకట్టుకోగలిగింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

టీనేజ్‌లో వున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడడం అనేది సహజం. అది ప్రేమా, ఎట్రాక్షనా అనేది తెలుసుకునే మానసిక స్థితి ఆ వయసులో వుండదు. కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత టీనేజ్‌లో తాము ప్రేమ కోసం తపించిన సంఘటనలు, తన లవర్‌ కోసం పడిన పాట్లు గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఎందుకంత ఫూలిష్‌గా బిహేవ్‌ చేసాం అనే ఆలోచన వస్తుంది. అలాంటి సిట్యుయేషనే ఈ కొలంబస్‌ చిత్రంలో హీరోయిన్‌ ఇందు(మిస్టీ చక్రవర్తి)కి ఎదురవుతుంది. అశ్విన్‌(సుమంత్‌ అశ్విన్‌), ఇందు ప్రేమించుకుంటారు. ఇందు ప్రేమలో మునిగిపోయిన అశ్విన్‌ స్టడీని నెగ్లెట్‌ చేస్తాడు. దాంతో ఎగ్జామ్‌ ఫెయిల్‌ అవుతాడు. కెరీర్‌ని పట్టించుకోడు. అప్పుడు అశ్విన్‌ మీద ఇందుకి ప్రేమ తగ్గిపోతుంది. స్టడీస్‌ కోసం ఢిల్లీ వెళ్ళిన ఇందు తనకి అశ్విన్‌ తొడిగిన రింగ్‌ను రిటర్న్‌ పంపించేస్తుంది. ఇదంతా ఫ్లాష్‌ బ్యాక్‌.. ప్రజెంట్‌లో సినిమా ఓపెన్‌ అవ్వడమే అశ్విన్‌ జైల్‌లో వుంటాడు. రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అశ్విన్‌ విడుదలవుతాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇందు గురించి ఎంక్వయిరీ చేస్తాడు. ఆమె అమెరికాలో వుందని తెలుసుకుంటాడు. అశ్విన్‌కి నీరజ(సీరత్‌కపూర్‌) అనే అమ్మాయి యాక్సిడెంటల్‌గా పరిచయమవుతుంది. ఈలోగా ఇందు ఇండియా వస్తుంది. నీరజ హెచ్‌ఆర్‌గా పనిచేసే కంపెనీలోనే ఆమె కూడా జాబ్‌ చేస్తుంటుంది. ఇందుని కలవడానికి నీరజ హెల్ప్‌ అడుగుతాడు అశ్విన్‌. అయితే అప్పటికే వంశీ(రోషన్‌) అనే వ్యక్తితో లవ్‌లో పడుతుంది ఇందు. వంశీని చూసి కోపంతో రగిలిపోతాడు అశ్విన్‌. వంశీ ఆమెకు రింగ్‌ తొడిగేందుకు ప్రయత్నిస్తుండగా ముఖానికి మాస్క్‌ వేసుకొని వచ్చి ఆ రింగ్‌ను కొట్టేసి పారిపోతాడు అశ్విన్‌. తన ప్రేమకథను నీరజకు చెప్పి తన ప్రేమను సక్సెస్‌ చేసుకునేందుకు హెల్ప్‌ చెయ్యమని అడుగుతాడు. వంశీని చూస్తే అశ్విన్‌కి ఎందుకంత కోపం వచ్చింది? వంశీకి, అశ్విన్‌కి వున్న గొడవ ఏమిటి? అసలు అశ్విన్‌ జైలుకి ఎందుకెళ్ళాడు? ఇందు ప్రేమను దక్కించుకోవడం కోసం నీరజతో కలిసి ఎలాంటి ట్రిక్స్‌ ప్లే చేశాడు? చివరికి ఇందు ఎవరికి సొంతం అయింది. అశ్విన్‌కా? వంశీకా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

పేరుకి ఇందు, అశ్విన్‌ లవర్సే అయినా వారి లవ్‌లో సిన్సియారిటీ కనిపించదు. రెండు సంవత్సరాల తర్వాత తను ప్రేమించిన అమ్మాయిని చూసినా అశ్విన్‌ ఎక్సైట్‌ అవ్వడు. ఎప్పటికప్పుడు సెల్ఫిష్‌గా బిహేవ్‌ చేసే క్యారెక్టర్‌ ఇందుది. తన లవర్‌ వంశీ మీద ఎన్నిసార్లు అనుమానం వచ్చినా క్షమించేస్తూ వుంటుంది. అశ్విన్‌ లవ్‌ కోసం హెల్ప్‌ చేసే క్యారెక్టర్‌ నీరజది. అతనికి హెల్ప్‌ చేసే ప్రాసెస్‌లో తను కూడా అతని లవ్‌లో పడిపోతుంది. అతని లవ్‌ సక్సెస్‌ చెయ్యడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. ప్రేమలో విఫలమై, ఆ ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నించే లవర్‌గా సుమంత్‌ అశ్విన్‌ ఓకే అనిపించాడు. మిస్టీ చక్రవర్తి పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆమెది పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న క్యారెక్టర్‌ కాదు. సీరత్‌కపూర్‌ తన క్యారెక్టర్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయి చేసిందని చెప్పాలి. ఇక మిగతా క్యారెక్టర్లలో చెప్పుకోదగినవి ఏమీ లేవు. 

టెక్నీషియన్స్‌ గురించి చెప్పుకోవాలంటే జితిన్‌ రోషన్‌ పాటలు ఆకట్టుకునేలా లేవు. జె.బి. చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం బాగుంది. భాస్కర్‌ సామల ఫోటోగ్రఫీ కూడా నీట్‌గా వుంది. ఇక యం.యస్‌.రాజు అందించిన కథ విషయానికి వస్తే ఇది చాలా పాత కథ. ఈ కథలో ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్ట్‌లు ఏమీ వుండవు. సాధారణ ప్రేక్షకులెవరైనా నెక్స్‌ట్‌ జరగబోయే సీన్‌ చెప్పెయ్యగలరు. ఎలాంటి కొత్తదనం లేని సాదా సీదా కథ. కథనం కూడా చాలా పేలవంగా వుంటుంది. కథను నడిపించే ప్రాసెస్‌ చాలా చీప్‌గా అనిపిస్తుంది. తన లవర్‌ వేరొకరిని ప్రేమిస్తోందని తెలిసి ఆ లవ్‌ని బ్రేక్‌ చేసేందుకు అశ్విన్‌, నీరజ ప్లే చేసే ట్రిక్కులు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. డైరెక్టర్‌ గురించి చెప్పాల్సి వస్తే అతను రాసిన మాటలు కూడా చాలా మామూలుగా వున్నాయి. ప్రతి సీన్‌ని లెంగ్తీగా తియ్యడం వల్ల ఆడియన్స్‌ చాలా బోర్‌ ఫీల్‌ అవుతారు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఏ సీన్‌ కూడా కొత్తగా అనిపించదు. ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసిన సీన్సే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే అప్పటి కొలంబస్‌ అమెరికాను కనిపెడితే.. ఈ కొలంబస్‌ మాత్రం తన లవ్‌ని డిస్కవర్‌ చేస్తుంటాడు. ఈ డిస్కవరీలో ఆడియన్స్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతగా దొరకలేదు. ఇలాంటి సినిమాలు ఆడియన్స్‌ ఇంతకుముందే చాలా చూసేసి వుండడం వల్ల ఈ కొలంబస్‌కి అనుకున్నంత ఆదరణ లభించకపోవచ్చు. ఈ సినిమాని సక్సెస్‌ చెయ్యడం అనేది యూత్‌ చేతుల్లోనే వుంది. మరి వాళ్ళు ఈ కొలంబస్‌ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో వేచి చూడాల్సిందే. 

ఫినిషింగ్‌ టచ్‌: కొత్త కథని డిస్కవర్‌ చేస్తే బాగుండేది 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ