Advertisementt

సినీజోష్‌ రివ్యూ: షేర్‌

Fri 30th Oct 2015 07:50 PM
telugu movie sher,nandamuri kalyan ram new movie sher,sher movie review,sher movie cinejosh review,director mallikarjun,sonal chauhan in sher  సినీజోష్‌ రివ్యూ: షేర్‌
సినీజోష్‌ రివ్యూ: షేర్‌
Advertisement
Ads by CJ

విజయలక్ష్మీ పిక్చర్స్‌ 

షేర్‌ 

తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌ చౌహాన్‌, 

బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, 

ఆలీ, ఎం.ఎస్‌., ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు 

సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి 

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

కథ, మాటలు: డైమండ్‌ రత్నంబాబు 

సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌ 

నిర్మాత: కొమర వెంకటేష్‌ 

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మల్లికార్జున్‌ ఎ. 

విడుదల తేదీ: 30.10.2015 

కొన్ని వరస ఫ్లాపుల తర్వాత నందమూరి కళ్యాణ్‌రామ్‌కి ఈ సంవత్సరం పటాస్‌ సూపర్‌హిట్‌ అయి శుభారంభాన్నిచ్చింది. ఆ సినిమా తర్వాత కళ్యాణ్‌రామ్‌ హీరోగా చేసిన సినిమా షేర్‌. అభిమన్యు, కత్తి వంటి ఫ్లాప్‌ సినిమాలు తన ఖాతాలో వేసిన డైరెక్టర్‌ మల్లికార్జున్‌కి మూడో అవకాశంగా షేర్‌ చిత్రాన్ని ఇచ్చాడు కళ్యాణ్‌రామ్‌. చాలా గ్యాప్‌ తర్వాత బయటి బేనర్‌లో సినిమా చేశాడు కళ్యాణ్‌రామ్‌. విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై కొమర వెంకటేష్‌ నిర్మించిన ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటించింది. మొదటి రెండు ఫ్లాపులతో గుణపాఠం నేర్చుకున్న మల్లికార్జున్‌ షేర్‌తో కళ్యాణ్‌రామ్‌కి సూపర్‌హిట్‌ ఇచ్చాడా? సూపర్‌హిట్‌తో సంవత్సరాన్ని ప్రారంభించిన కళ్యాణ్‌రామ్‌ షేర్‌తో ఈ సంవత్సరాన్ని ఎలా ముగించాడు? ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన షేర్‌ ఎలా వుందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఒక సిటీ. ఆ సిటీని గడగడలాడించే ఒక గూండా. అతనికి మద్దతుగా కోల్‌కత్తాలో వుండే మరో బడా గూండా. వారి ఆగడాలను అడ్డుకునే హీరో. తన ప్రియురాలికిగానీ, తన కుటుంబ సభ్యులకుగానీ ఆ గూండాల వల్లే సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యల్ని తన తెలివితేటలతో చేతికి మట్టి అంటకుండా ఎంతో సునాయాసంగా పరిష్కరించుకుంటాడు హీరో. ఎంత కరడు గట్టిన నేరస్తుడైనా హీరో ముందుకు వచ్చేసరికి బఫూన్‌లా మారి వెర్రి చేష్టలు చేసే విలన్లు. ఇవన్నీ ఈ సినిమాలో వున్నాయి. ఈ సినిమాలో ఏంటీ.. ఇలాంటి కథతో చాలా సినిమాలు మనం చూసేశాం. కథ ఎంత రొటీన్‌గా వున్నా, కథనం ఎంత బోరింగ్‌గా వున్నా సూపర్‌ సబ్జెక్ట్‌ అనే హీరో, అదరగొట్టే సినిమా తీసి చూపిస్తానని చెప్పే డైరెక్టర్‌, వీళ్ళిద్దర్నీ నమ్మి కోట్లు కుమ్మరించి సినిమా తియ్యడానికి ముందుకొచ్చే నిర్మాతలు వున్నంతకాలం ఇలాంటి సినిమాలు వస్తూనే వుంటాయి. 

ఇక షేర్‌లోని కథ, కథనాల విషయానికి వస్తే గౌతమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఓనర్‌ రావు రమేష్‌ బిజినెస్‌కి సంబంధించిన పనులు చూసుకుంటూ తండ్రికి అండదండగా వుండే కొడుకు గౌతమ్‌(కళ్యాణ్‌రామ్‌). మరో పక్క రకరకాల నేరాలు చేస్తూ సిటీని వణికించే పప్పీ(విక్రమ్‌జీత్‌)కి పెళ్ళి చేసుకోవడమే జీవితాశయం. అదే అతని గోల్‌, అదే అతని ఎయిమ్‌. వేరొకరితో పెళ్ళి జరగాల్సిన అమ్మాయిని ఎత్తుకొచ్చి పెళ్ళికి రెడీ అయిపోతాడు పప్పీ. సోషల్‌ సర్వీస్‌ కూడా చేసే గౌతమ్‌ పెళ్ళి మండపం నుంచి అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆమె లవర్‌తో రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసేస్తాడు. ఇది తెలుసుకున్న పప్పీ.. గౌతమ్‌తో ఛాలెంజ్‌ చేస్తాడు. గౌతమ్‌ పేమించిన అమ్మాయిని తను పెళ్ళి చేసుకొని మానసికంగా హింసిస్తానంటాడు. కొన్ని విచిత్రమైన సంఘటనల తర్వాత గౌతమ్‌, నందిని(సోనాల్‌ చౌహాన్‌)ల మధ్య ప్రేమ పుడుతుంది. నందిని తండ్రి(షాయాజీ షిండే)కి డిజిపిగా ప్రమోషన్‌ ఇప్పిస్తానని చెప్పి ఆమెతో పెళ్ళి ఓకే చేయించుకుంటాడు పప్పీ. క్రిమినల్స్‌ని చంపి అది నందిని తండ్రి ఎకౌంట్‌లో వేసి అతన్ని డిజిపిని చేస్తానంటాడు గౌతమ్‌. డిజిపి పోస్ట్‌ కోసం పెళ్ళికి ఒప్పుకున్న నందిని తండ్రి గౌతమ్‌ డీల్‌కి ఏం సమాధానం చెప్పాడు? తన ప్రియురాలిని దక్కించుకోవడం కోసం గౌతమ్‌ క్రిమినల్స్‌ని హతమార్చాడా? ప్రేమకోసమే గౌతమ్‌ ఇదంతా చేశాడా? లేక వేరే కారణం వుందా? అనేది మిగతా కథ. 

గౌతమ్‌గా కళ్యాణ్‌రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌ రొటీన్‌గానే వుంది. కాకపోతే పటాస్‌ చిత్రంలోలా కాకుండా అతనితో డైలాగ్స్‌ చాలా తక్కువ చెప్పించారు. లుక్స్‌ వైజ్‌ కళ్యాణ్‌రామ్‌ బాగున్నాడు. వీలైనంత అందంగా చూపించే ప్రయత్నం చేశాడు సర్వేష్‌ మురారి. హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌ క్యారెక్టర్‌ చాలా సాదా సీదాగా వుంది. ఫస్ట్‌ హాఫ్‌లో ఆమె క్యారెక్టర్‌కి వున్న ప్రిఫరెన్స్‌ సెకండాఫ్‌లో అస్సలు వుండదు. అయితే చాలా సీన్స్‌లో, పాటల్లో సోనాల్‌ గ్లామరస్‌గా కనిపించింది. బ్రహ్మానందం చేసిన బాబాయ్‌ క్యారెక్టర్‌ పరమ రొటీన్‌గా వుంది. అతను చేసే కామెడీకి చక్కిలిగింతలు పెట్టినా నవ్వు రాని పరిస్థితి. ఇక హీరో తండ్రిగా రావు రమేష్‌ అనవసరమైన క్యారెక్టర్‌ చేశాడనిపిస్తుంది. సిటీలో విలన్‌గా విక్రమ్‌జీత్‌, అతని అనుచరులుగా ఫిష్‌ వెంకట్‌, ప్రభాస్‌ శ్రీను, రఘు కారుమంచి, కోల్‌కత్తాలో వుండే విలన్‌గా ముఖేష్‌రుషి, అతని అనుచరులుగా ఆశిష్‌ విద్యార్థి, శ్రావణ్‌, పృథ్వీ చేసిన క్యారెక్టర్స్‌లో ఎలాంటి కొత్తదనం లేదు. వారి పెర్‌ఫార్మెన్స్‌ కూడా అంతంత మాత్రంగానే వుంది. అయితే విలన్‌ గ్యాంగ్‌, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ అక్కడక్కడ నవ్వించడానికి ట్రై చేశారు. 

సర్వేష్‌ మురారి ఫోటోగ్రఫీ రిచ్‌గా వుంది. ముఖ్యంగా ఫారిన్‌లో తీసిన పాటలు పిక్చరైజేషన్‌ పరంగా బాగున్నాయనిపిస్తుంది. కొన్ని లొకేషన్స్‌ కూడా కొత్తగా వున్నాయి. థమన్‌ మ్యూజిక్‌ కూడా ఆకట్టుకునేలా లేదు. రెండు పాటలు తప్ప మిగతావన్నీ రొటీనే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో థమన్‌ ఎలాంటి కేర్‌ తీసుకోలేదని అర్థమవుతుంది. డైమండ్‌ రత్నంబాబు కథగానీ, మాటలుగానీ ఏమాత్రం ఆసక్తికరంగా లేవు. మల్లికార్జున్‌ రాసుకున్న స్క్రీన్‌ప్లే కూడా చాలా అవకతవకగా అనిపిస్తుంది. సినిమాలో నెక్స్‌ట్‌ ఏం జరగబోతోందో కామన్‌ ఆడియన్‌కి ఈజీగా తెలిసిపోతుంది. కథను ఒక ఫ్లోలో తీసుకెళ్ళడంలో డైరెక్టర్‌ మల్లికార్జున్‌ సక్సెస్‌ కాలేకపోయాడు. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఆడియన్స్‌ని కట్టి పడేసే సన్నివేశాలుగానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌గానీ, ఎమోషన్స్‌గానీ, సెంటిమెంట్స్‌గానీ సినిమాలో కనిపించవు. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్‌తో సినిమాని కాస్త పైకి లేపే ప్రయత్నం చేశాడు గానీ అది కూడా తేలిపోయింది. ఇక నిర్మాత కొమర వెంకటేష్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని రిచ్‌గా నిర్మించాడు. 

ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా సినిమా చూడండి, ఇందులో గొప్ప ట్విస్ట్‌లుగానీ, భారీ డైలాగులుగానీ వుండవు. చాలా నార్మల్‌ సినిమా అని కళ్యాణ్‌రామ్‌ చెప్పినట్టుగానే కథలోగానీ, కథనంలోగానీ ఎలాంటి ప్రత్యేకతలు లేని సినిమా షేర్‌. సినిమా స్టార్టింగ్‌లో హీరోతో విలన్‌ ఛాలెంజ్‌ చేస్తాడు. ఆ ఛాలెంజ్‌కి అవసరమైన అమ్మాయిని హీరోకి కలపడం కోసం దాదాపు ఫస్ట్‌ హాఫ్‌ అంతా తీసుకున్నాడు డైరెక్టర్‌. బ్రేక్‌ తీసుకోండి అసలేం జరిగిందో చెప్తానని, ఫస్ట్‌హాఫ్‌లో మనం చూసిన దాన్నే సస్పెన్స్‌ రివీల్‌ చేసినట్టుగా చెప్తాడు. హీరో, హీరోయిన్‌ కలుసుకోవడం, వాళ్ళిద్దరికీ బ్రహ్మానందం అడ్డు పడడం, హీరోయిన్‌ని పెళ్ళి చేసుకోవాలని విలన్‌ ట్రై చెయ్యడం ఇలాంటి సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ అంతా చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌ బాగుంటుందిలే అనుకొని థియేటర్‌లోకి వెళ్ళి ఆడియన్‌కి ఫస్ట్‌ హాఫ్‌ చాలా బెటర్‌ అనే ఫీలింగ్‌ తెస్తుంది సెకండాఫ్‌. ఈమధ్య చాలా సినిమాల్లోలాగే విలన్‌ ఇంట్లోనే హీరో, హీరోయిన్‌, కమెడియన్స్‌ మకాం వెయ్యడం, తన మాస్టర్‌ ప్లాన్స్‌తో విలన్‌ని హీరో బురిడీ కొట్టించడం వంటి సీన్స్‌తో తన శక్తి మేరకు ఆడియన్స్‌ని విసిగించిన డైరెక్టర్‌ చివర్లో ఫ్లాష్‌బ్యాక్‌లోని ఒక ట్విస్ట్‌తో స్టోరీ టర్న్‌ చేయడానికి ట్రై చేశాడు. ఇక అక్కడి నుంచి డైరెక్ట్‌గా క్లైమాక్స్‌ వచ్చేస్తాడు. ఫైనల్‌గా చెప్పాలంటే అభిమన్యు, కత్తి వంటి ఫ్లాప్‌ సినిమాలను కళ్యాణ్‌రామ్‌కి ఇచ్చిన మల్లికార్జున్‌ ఆ రెండు సినిమాల సరసన షేర్‌ని కూడా చేరుస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: షేర్‌.. ఇది చాలా బోర్‌ గురూ! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ