Advertisementt

మీడియాని వ్యాపారం చేసేశారు!

Fri 26th Feb 2016 03:42 PM
telugu cinema,pros,business,politics,telugu cinema industry,publicity  మీడియాని వ్యాపారం చేసేశారు!
మీడియాని వ్యాపారం చేసేశారు!
Advertisement
Ads by CJ

మీడియాకి కొన్ని విలువలు వున్నాయి, వుండాలి అని రాజకీయ నాయకులు ఎప్పుడు చెబుతుంటారు.మీడియాని ఎలా వాడుకోవాలో వారికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని అనుకుంటుండటం చూస్తూనే ఉన్నాం. కానీ, ఆ రాజకీయ నాయకులనే మించిపోయేలా మీడియాని వాడుతున్నారు సినిమా ఇండస్ట్రీలోని కొందరు. మీడియాలోని కొందరిని మేనేజ్‌ చేయగలిగితే చాలు తమ సినిమాకి ఎలాంటి ప్రోమోషన్‌ని అయినా తెప్పించుకోవచ్చు అని వారు భావిస్తున్నారు. గతంలో ఇటువంటివి చాలా అరుదుగా కనిపించినా..తాజాగా మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదో వ్యాపారంగా తయారైంది. సినిమాని ప్రోమోట్‌ చేయాల్సిన ప్రచారకర్తలే ఆ సినిమాకి సంబంధించి బిజినెస్‌ మాట్లాడుకోవడం విడ్డూరం. ఆ బిజినెస్‌లో భాగంగా కొన్ని పత్రికలవారిని, ఛానెల్స్‌ వారిని, వెబ్‌సైట్స్‌వారిని మేనేజ్‌ చేసి..వారికి ఇవ్వాల్సింది ఇచ్చి..వీరికి కావాల్సింది రాబట్టుకుంటున్నారు. ఈ బిజినెస్‌లో వారి సంపాందించేది ఎంతో, సదరు సినిమాకి ఈ బిజినెస్‌ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కానీ, వీరి బిజినెస్‌కి అలవాటు పడ్డ వారంతా.. నిజాయితీగా వెళ్లే వారిని కూడా బెదిరించి మరీ బిజినెస్‌ చేయడానికి ప్రయత్నిస్తుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి, ఇలాగే కంటిన్యూ అయితే..తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాత అనే వాడు నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. ఇకనైనా సినీ పెద్దలు కళ్ళు తెరిచి ఈ బిజినెస్‌కి అడ్డుకట్ట వేస్తారేమో చూద్దాం.!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ