Advertisementt

సినీజోష్‌ రివ్యూ: కథకళి

Sat 19th Mar 2016 01:50 PM
vishal new movie kathakali,vishal new telugu movie kathakali,kathakali movie telugu review,kathakali movie review,kathakali movie review in cinejosh,kathakali cinejosh review  సినీజోష్‌ రివ్యూ: కథకళి
సినీజోష్‌ రివ్యూ: కథకళి
Advertisement
Ads by CJ

విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ 

కథకళి 

తారాగణం: విశాల్‌, కేథరిన్‌ త్రెస, మధుసూదన్‌, 

కరుణాస్‌, మైమ్‌గోపీ, శ్రీజిత్‌ రవి, శత్రు తదితరులు 

సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం 

సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ 

ఎడిటింగ్‌: ప్రదీప్‌ ఇ. రాఘవ్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

నిర్మాత: విశాల్‌ 

రచన, దర్శకత్వం: పాండిరాజ్‌ 

విడుదల తేదీ: 18.03.2016 

పందెంకోడితో మాస్‌ హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్‌ ఆ తర్వాత చేసిన సినిమాలతో మాస్‌, యాక్షన్‌ హీరోగా తెలుగులో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ప్రత్యేకత వుండాలని కోరుకునే విశాల్‌ సొంతంగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బేనర్‌ను స్టార్ట్‌ చేసి డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. లేటెస్ట్‌గా కథకళి పేరుతో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను డైరెక్టర్‌ పాండిరాజ్‌తో కలిసి తమిళ్‌లో నిర్మించాడు. ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్‌ అధినేత గౌరీకృష్ణ అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు. పసంగ చిత్రంతో నేషనల్‌ అవార్డు అందుకున్న పాండిరాజ్‌ ఫస్ట్‌ టైమ్‌ యాక్షన్‌ జోనర్‌లో చేసిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌లో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచిన కథకళి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది? మర్డర్‌ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్‌ని ఏమేర థ్రిల్‌ చేసింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఓపెన్‌ చేస్తే యు.ఎస్‌. వెళ్ళి నాలుగు సంవత్సరాల తర్వాత తను ప్రేమించిన మల్లీశ్వరి(కేథరిన్‌ త్రెస)ని పెళ్ళి చేసుకోవడానికి కాకినాడ వస్తాడు కమల్‌(విశాల్‌). కాకినాడలో జాలర్ల సంఘం అధ్యక్షుడుగా వుంటూ తన బలంతో, తన బలగంతో సెటిల్‌మెంట్లు కూడా చేస్తూ దానివల్ల నష్టపోయిన వారి పగకు కారణమవుతాడు సాంబ(మధుసూదన్‌). సాంబ వల్ల నాలుగు సంవత్సరాల క్రితం తన ఫ్యామిలీకి అన్యాయం జరిగినప్పటికీ తన పెళ్ళికి అతన్ని ఆహ్వానిస్తాడు కమల్‌. ఒకరోజు సాంబను ఒక పథకం ప్రకారం ఎవరో హత్య చేస్తారు. తన భర్తను చంపిన హంతకుడ్ని పట్టుకునే వరకు శవాన్ని తీసుకెళ్ళేది లేదని సాంబ భార్య నిరసనకు దిగుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్‌ చెయ్యడానికి సి.ఐ. హరిశ్చంద్రప్రసాద్‌(శ్రీజిత్‌ రవి) రంగంలోకి దిగుతాడు. సాంబకు శత్రువులు చాలా మంది వుండడంతో అతన్ని ఎవరు చంపి వుంటారనే విషయంలో పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతారు. కమల్‌ స్నేహితుల్లో ఒకడైన సత్యం.. సాంబ దగ్గర పనిచేస్తుంటాడు. ఈ హత్య చేసింది ముమ్మాటికి కమలేనని, గతంలో తనకు జరిగిన అన్యాయానికి సాంబను చంపుతానని ఛాలెంజ్‌ చేశాడని పోలీసులకు కంప్లయింట్‌ చేస్తాడు సత్యం. దీంతో హరిశ్చంద్రప్రసాద్‌ తన కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా కమల్‌పై పెడతాడు. ఆ టైమ్‌లో వైజాగ్‌లో వున్న కమల్‌ని అర్జంట్‌గా కాకినాడ వచ్చి తనని కలవమని ఆర్డర్‌ పాస్‌ చేస్తాడు. కమల్‌ కాకినాడ బయల్దేరతాడు. అసలు సాంబని హత్య చేసిందెవరు? నేరం మోపబడ్డ కమల్‌ కాకినాడ వెళ్ళి సి.ఐ.ని కలుసుకున్నాడా? సత్యం తన స్నేహితుడు కమల్‌పై ఎందుకు కంప్లయింట్‌ ఇచ్చాడు? ఈ మర్డర్‌ మిస్టరీ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి సాంబను హత్య చేసిందెవరో తెలిసిందా? అనేది తెరపై చూడాల్సిందే. 

కమల్‌గా విశాల్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. ఒక లవర్‌గా, ఫ్యామిలీని కాపాడుకునే కొడుకుగా, అన్నయ్య కోసం విలన్‌తో తలపడే తమ్ముడుగా విశాల్‌ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్‌లోని డిఫరెంట్‌ షేడ్స్‌ని, యాక్షన్‌ సీక్వెన్స్‌లలో ఫోర్స్‌ని అద్భుతంగా చూపించగలిగాడు. హీరోయిన్‌ కేథరిన్‌ కేవలం లవ్‌ ట్రాక్‌కి తప్ప మర్డర్‌ మిస్టరీతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఆమె తన లిమిట్స్‌ మేరకు బాగానే చేసింది. సాంబగా మధుసూదన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. మిగతా క్యారెక్టర్స్‌లో సి.ఐ.గా నటించిన శ్రీజిత్‌ రవి పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగుంది. 

టెక్నికల్‌గా ఈ సినిమాకు ఎస్సెట్‌ అయినవి బాలసుబ్రహ్మణ్యం ఫోటోగ్రఫీ, హిప్‌హాప్‌ తమిళ మ్యూజిక్‌. లైటింగ్స్‌ విషయంలో ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా ప్రతి సీన్‌ని నేచురల్‌గా చూపించడంలో బాలసుబ్రహ్మణ్యం హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. హిప్‌ హాప్‌ తమిళ మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే ఇందులో చెప్పుకోదగ్గ పాటలు లేకపోయినా, సినిమాలోని ఎమోషన్‌ని, సస్పెన్స్‌ని క్యారీ చేస్తూ అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రదీప్‌ ఇ.రాఘవ్‌ ఎడిటింగ్‌ కూడా ఎక్కడా ల్యాగ్‌ లేకుండా ఫాస్ట్‌గా వుంది. ఎప్పటిలాగే శశాంక్‌ వెన్నెలకంటి డైలాగ్స్‌ బాగా రాశాడు. ఇక డైరెక్టర్‌ పాండిరాజ్‌ ఒక రొటీన్‌ మర్డర్‌ మిస్టరీని సెలెక్ట్‌ చేసుకున్నప్పటికీ చక్కని స్క్రీన్‌ప్లేతో, మంచి సస్పెన్స్‌ మెయిన్‌ టెయిన్‌ చేస్తూ ఆడియన్స్‌ని థ్రిల్‌ చెయ్యగలిగాడు. సాంబని ఎవరు మర్డర్‌ చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలను ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యడానికి వీలు లేకుండా చివరి వరకు రన్‌ చేయడంలో పాండిరాజ్‌ సక్సెస్‌ అయ్యాడు. అలాగే ఫస్ట్‌ హాఫ్‌లో అసలు కథలోకి ఎంటర్‌ అవ్వకుండా కమల్‌ చెప్పే లవ్‌ ట్రాక్‌ రొటీన్‌గా కాకుండా కాస్త ఎంటర్‌టైనింగ్‌గా వుండడంతో ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయ్యే అవకాశంగానీ, అసలు కథ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే ఆలోచనగానీ రాకుండా చేసింది. 

హీరో ఇండియా వచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్‌ని కలుసుకోవడం, తన పెళ్ళికి సంబంధించిన పనుల్లో హడావిడిగా తిరగడం, మధ్యలో అతని లవ్‌స్టోరీ ఫ్లాష్‌ బ్యాక్‌.. ఇలా దాదాపు ఫస్ట్‌ హాఫ్‌ అంతా రన్‌ అవుతుంది. ఇంటర్వెల్‌కి ఇచ్చిన ట్విస్ట్‌ సెకండాఫ్‌లో ఏం జరగబోతోందన్న క్యూరియాసిటీ కలిగిస్తుంది. కమల్‌ వైజాగ్‌ నుంచి కాకినాడకు బయల్దేరినప్పటి నుంచి ప్రతి సీన్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో మర్డర్‌ మిస్టరీలను చూసిన ఆడియన్స్‌కి ఈ సినిమా ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయినప్పటికీ తెలుగులో ఈ సినిమాకి కమర్షియల్‌గా ఎంత వర్కవుట్‌ అవుతుందన్న విషయం చెప్పడం కష్టం. ఎందుకంటే ఆడియన్స్‌ కోరుకునే ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గానీ, పాటలుగానీ ఈ సినిమాలో లేవు. సెకండాఫ్‌లో ప్రతి సీన్‌ సీరియస్‌గానే వుంటుంది తప్ప ఎక్కడా రిలీఫ్‌ వుండదు. ఫైనల్‌గా చెప్పాలంటే రెగ్యులర్‌ ఫార్మాట్‌ కాకుండా డిఫరెంట్‌ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది. డిఫరెంట్‌ కాస్పెప్ట్‌తోపాటు అన్నిరకాల ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా వుండాలని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అంతగా నచ్చే అవకాశాలు తక్కువ. గతంలో విశాల్‌ చేసిన చాలా సినిమాలకు టాక్‌ బాగానే వచ్చినప్పటికీ కమర్షియల్‌గా వర్కవుట్‌ అవ్వలేదు. ఇప్పుడు కథకళి కూడా అదే కోవకు చెందిన సినిమా కావడంతో కలెక్షన్లపరంగా ఈ సినిమాకి ఎలాంటి టాక్‌ వస్తుందో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు ఆగాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ