Advertisementt

ఓటీటీ రివ్యూ: ‘వి’

Sun 06th Sep 2020 10:25 PM
v the movie,v movie review,v movie rating,v telugu movie,nani,sudheer babu,nivetha,aditi rao hydari,mohankrishna indraganti  ఓటీటీ రివ్యూ: ‘వి’
Nani V Movie Review ఓటీటీ రివ్యూ: ‘వి’
Advertisement
Ads by CJ

నటీనటులు: నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, రోహిణి తదితరులు.

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

సంగీతం: అమిత్ త్రివేది

సినిమాటోగ్రాఫర్: పి.జి.విందా

నిర్మాత: దిల్ రాజు

దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి

సస్పెన్స్ థ్రిల్లర్ అంటే తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రేక్షకులను కుర్చీలో నిలవనివ్వదు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ హర్రర్ జోనర్స్ సినిమాలు చాలానే వచ్చినా.. ఆ జోనర్‌కి ఓ స్పెషల్ కేటగిరి ప్రేక్షకులు ఉంటారు. అందుకే ఓసారి అలాంటి థ్రిల్లర్ మూవీ చేసిన దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నేచురల్ స్టార్ నానిని నెగెటివ్ షేడ్స్‌లో చూపిస్తూ సుధీర్ బాబు హీరోగా వి అనే థ్రిల్లర్ మూవీని చేసాడు. ఎప్పుడూ హీరోగా కనబడుతూ, ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న నాని విలన్ అనగానే అందరిలో పిచ్చ ఆసక్తి. నాని విలనిజం ఎలా ఉండబోతుంది అనే ఆతృతలో పడి సుధీర్ బాబు హీరో అన్న విషయం ప్రేక్షకులు కూడా చాలావరకు మరిచిపోయారు. మరి నాని విలన్ గా - సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన వి థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటిటి అమెజాన్ ప్రైమ్ నుండి ప్రేక్షకుల ఇంటిలోపల ప్రత్యక్షమయ్యింది. మరి ఒత్తిడిలో విడుదలవుతుంది మనకెందుకులే అని ఊరుకోకుండా వి టీం ఈ సినిమాని బాగా ప్రమోట్ చెయ్యడంతో వి పై అందరిలో ఆసక్తి కనబడింది. మరి ప్రేక్షకుల అంచనాలను వి సినిమా అందుకుందో? లేదో? అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ: మొహరం రోజున హైదరాబాద్‌లో జరిగిన మత ఘర్షణల్లో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డిఎస్పీ ఆదిత్య(సుధీర్ బాబు) ఆ అల్లర్లని సమర్ధవంతంగా అదుపులోకి తెస్తాడు. ఆదిత్య డీఎస్పీగా, టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తూ రౌడీ గ్యాంగ్స్ ని మట్టు బెడుతూ.. అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ బోలెడన్ని మెడల్స్ సాధించిన పోలీస్ ఆఫీసర్‌గా క్రేజ్ తెచ్చుకుంటాడు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్‌కి ఒక కిల్లర్(నాని) పోలీస్ డిపార్ట్మెంట్‌లోనే ఆదిత్య టీంలోని ప్రసాద్‌ని చంపి ఆదిత్యకి ఛాలెంజ్ విసురుతాడు. అయితే ఆ సైకో కిల్లర్ డైరెక్ట్ గా ఆదిత్యకే ఫోన్ చేసి నేను ఇంకొంతమందిని చంపబోతున్నాను.. దమ్ముంటే ఆపు, ఆపలేకపోతే నువ్వు సాధించిన మెడల్స్, నీ జాబ్ వదిలేయాలంటూ ఛాలెంజ్ విసురుతాడు. దానికి ఆదిత్య కూడా ఛాలెంజ్‌ని స్వీకరిస్తాడు. ఆదిత్య విలన్‌ని ట్రేస్ చెయ్యడానికి తన టీం తో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా.. వి అనే క్లూతో ఆ కిల్లర్ మల్లిఖార్జున అనే బిల్డర్‌ని చంపి... ఆదిత్య కోసం కొన్ని పజిల్స్ ఇస్తాడు. అసలు వి ఎవరు? ఎందుకు మర్డర్లు చేస్తున్నాడు? ఓ ఆర్మీ ఆఫీసర్ విలన్ గా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆదిత్య ‘వి’ని ఎలా పట్టుకున్నాడు? అసలు ‘వి’ ఆదిత్యకి దొరికాడా? ఆ ఛాలెంజ్‌లో ఆదిత్య గెలిచాడా? అనేది ‘వి’ సినిమా కథ.

నటీనటులు:

పవర్‌ఫుల్ డిఎస్పీ‌గా సిక్స్ ప్యాక్ లుక్ లో సుధీర్ బాబు ఇరగ దీసాడు. సినిమా స్టార్టింగే సుధీర్ బాబు ఎంట్రీని యాక్షన్ తో స్టార్ట్ చేశారు. సుధీర్ బాబు లుక్స్ లోను, నటనలోనూ అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఇక ముఖ్యంగా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్‌గా నాని నటన గురించి ఎంత మాట్లాడిన తక్కువే. ఇంతవరకు హీరోగానే నేచురల్ నటనతో కట్టిపడేసిన నాని మొదటిసారి నెగెటివ్ షేడ్స్ తో అదరగొట్టేసాడు. మనుషులని ఎలా చంపితే ప్రాణాలు త్వరగా పోతాయో అలా చంపేటప్పుడు నాని యాంగ్రీ లుక్స్ కానీ, కామెడీ షేడ్స్ గాని అదరగొట్టేసాడు. ఇక నాని ఆర్మీ లుక్ కూడా బావుంది. సీరియస్ కామెడీతోనూ నాని అదరగొట్టేసాడు. హీరోయిన్స్ లో నివేత థామస్ సైకలాజికల్ స్టూడెంట్ గా, సుధీర్ బాబు ని లవ్ చేసే అమ్మాయిలా లుక్స్ పరంగాను, నటన పరంగాను పర్ఫెక్ట్ గా కనిపించింది. ఇక అదితి రావు సాహెబా పాత్రలో ఒదిగిపోయింది. వెన్నెల కిషోర్ సుధీర్ బాబు రైట్ హ్యాండ్ గా కామెడీ పండించాడు. అలాగే పోలీస్ ఆఫీసర్ గాను అదరగొట్టాడు. ఇక మిగతా నటీనటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

‘వి’ టైటిల్ చూసిన దగ్గరనుండి ఇదో సైకో థ్రిల్లర్ అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. దర్శకుడు ఇంద్రగంటి గతంలోనూ జెంటిల్మెన్ సినిమాని ఇలానే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. అయితే థ్రిల్లర్ సినిమా అంటే ఉత్కంఠకు గురిచేస్తూ తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ లేకుండా ఇంద్రగంటి వి సినిమాని తెరకెక్కించాడు. వి సినిమాలో కేవలం థ్రిల్ కలిగించే అంశాలే కాదు.. రొమాన్స్, అలాగే కామెడీ కూడా ఉంది. యాక్షన్ తోనే సుధీర్ బాబు ఎంట్రీ సీన్ చాలా బావుంటుంది. ఇక నాని కూడా ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ ని చంపేటప్పుడు నాని పాత్ర రివీల్ కావడం హైలెట్. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నాని డిఎస్పీ సుధీర్ బాబుకి ఛాలెంజ్ చేసి.. సమాజంలోని చీడపురుగులు చంపేస్తుంటాడు. నాని ఛాలెంజ్ ని స్వీకరించిన సుధీర్ బాబు నానిని పట్టుకోవడానికి రకరకాల ప్లాన్స్ వేసినా నాని ఈజీగా తప్పించుకుంటాడు.. సుధీర్ బాబు -  నివేత లవ్ ట్రాక్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఆసక్తికరంగానే ఉంది. ఇక సుధీర్ బాబు కి ముంబైలో నాని జస్ట్ మిస్ అయినా... అప్పటినుండి నాని ని వెంటాడుతుంటే సుధీర్ బాబు కి నాని డైరెక్ట్ ఛాలెంజ్ చెయ్యడం, దాని కోసం క్లూస్ వదలడం, అన్ని బావున్నాయి. సెకండ్ హాఫ్ లో నాని చేసిన మర్డర్లు తో సుధీర్ బాబు ఇచ్చిన ఛాలెంజ్ కి కట్టుబడి జాబ్ రిజైన్ చెయ్యడం, నాని ఫ్లాష్ బ్యాగ్, అదితి తో పెళ్లి, అలాగే నాని వలనే సుధీర్ బాబు మళ్లీ జాబ్ లోకి రావడం.. క్లైమాక్స్ ట్విస్ట్ లో నాని - సుధీర్ బాబు కలిసిపోవడం అన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. మరి రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ లా కాకుండా ఇంద్రగంటి కాస్త కొత్తగా ఈ సినిమాని తెరకెక్కించాడు. రొమాన్స్ - కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ లా ‘వి’ని మలిచాడు.  

సాంకేతికంగా..

సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అందించిన మ్యూజిక్ లో సాంగ్స్ ఆకట్టుకున్నప్పటికీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ నిరాశపరిచింది. థ్రిల్లర్ మూవీస్‌కి ప్రాణం పోసేది ఈ నేపధ్య సంగీతమే. కానీ వి బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే రాక్షసుడు బ్యాగ్రౌండ్ స్కోర్ గుర్తుకురాక మానదు. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లోని విజువల్స్ ను విందా చాలా సహజంగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది గాని.. ఫస్ట్ హాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. దిల్ రాజు నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

రేటింగ్: 2.5/5

Nani V Movie Review :

V the Movie Review and rating

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ