బ్యానర్: గీతా ఆర్ట్స్ 2
నటీనటులు కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమని, మురళి శర్మ, రజిత, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, జబర్దస్త్ మహేశ్, తనికెళ్ళ భరణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: జుక్స్ బిజాయ్
సినిమాటో గ్రఫీ: కర్మ్ చావ్లా, సునీల్ రెడ్డి
ఎడిటింగ్: జి. సత్య
నిర్మాత: బన్నీ వాసు
దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి
RX 100 తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ ఆ సినిమా తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అయితే కార్తికేయకి RX 100 మూవీ తప్ప మరో సినిమా మాత్రం హిట్ ఇవ్వలేదు. మధ్యలో రెండు మూడు సినిమాలతో అదృష్టాన్ని పరిక్షించుకున్న కార్తికేయకి ఎదురు దెబ్బలే తగిలాయి కానీ.. హిట్ మాత్రం దక్కలేదు. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మాతగా లావణ్య త్రిపాఠి తో కలసి చావు కబురు చల్లగా అనే సినిమా చేసాడు. బస్తి బాలరాజు గా మాస్ లుక్స్ తో కనిపిస్తున్న కార్తికేయకి గీత ఆర్ట్స్ బ్యానర్ లాంటి బిగ్ బ్యానర్, అల్లు అరవింద్ లాంటి వారు ఎంతవరకు ఆదుకున్నారు? కార్తికేయకి హీరోగా హిట్ ఇచ్చారా? లేదా? అనేది సమీక్షలో చూసేద్దాం.
కథ:
బస్తీబాలరాజు (కార్తికేయ) నగరంలో చనిపోయిన వారి మృత దేహాల్ని అంతిమ యాత్ర వాహనంలో స్మశానికి తరలిస్తూ.. ఉండే ఓ వ్యాన్ డ్రైవర్. మంచాన పడ్డ తండ్రి, తన తల్లితో జీవనం గడిపే సామాన్య యువకుడు. బాలరాజు శవాల్ని తీసుకెళ్ళే క్రమంలో ఒక ఇంటికి వెళ్ళిన అతడు.. అక్కడ చనిపోయిన పీటర్ వైఫ్ మల్లిక (లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయిని చూస్తాడు. తొలిచూపులోనే ఆ అమ్మాయి నచ్చేసి.. ఆమె భర్త అంత్యక్రియల నాడే.. తనని పెళ్ళి చేసుకోమని అడుగుతాడు. అక్కడ నుంచి ఆమె వెంటే పడుతూ ఎలా అయినా ఇంప్రెస్ చెయ్యాలని చూస్తాడు. చివరికి బాలరాజు, మల్లిక ప్రేమను ఎలా పొందుతాడు? మధ్యలో బాలరాజు తల్లి ఆమనీ కథ ఏమిటి? బాలరాజు - మల్లిక ఒక్కటవుతారా? అనేది మిగతా కథ.
పెరఫార్మెన్స్:
బస్తీ యువకుడి బలరాజులా సూపర్బ్ పెర్ఫామెన్స్ కనబరిచాడు కార్తికేయ. పూర్తిగా అలాంటి రోల్ కు ఏం కావాలో అందులో లీనమయ్యి సాలిడ్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, కార్తికేయ ఈజె నెస్ మెప్పిస్తాయి. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో అతడి బాడీ లాంగ్వేజ్ బాగా కుదిరింది. ఒక్క మాటలో చెప్పాలంటే కార్తికేయ కనిపించకుండా తెరపై బస్తీబాలరాజు పాత్ర మాత్రమే కనిపించేలా అద్భుతంగా నటించాడు. ఇక మల్లిక గా లావణ్య త్రిపాఠి పాత్రకు తగ్గ రీతిలో సింపుల్ లుక్స్ తో కనిపించడం వలన ఆమె నటనలో కూడా మరింత సహజత్వం కనిపిస్తుంది. ఎమోషన్స్, తన బాడీ లాంగ్వేజ్ మరియు కొన్ని కీలక సన్నివేశాల్లో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. మురళీ శర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆమని, భద్రం, జబర్దస్త్ మహేశ్ తమ పాత్రల పరిధిమేర మెప్పించారు.
విశ్లేషణ:
కౌశిక్ పెగళ్ళపాటి ఈ సినిమాకి తీసుకున్న స్టోరీ లైన్ ఎగ్జైటింగ్ గానే అనిపిస్తుంది. అంతిమ యాత్ర వాహనం నడిపే ఓ డ్రైవర్.. భర్త చనిపోయిన బాధలో ఉన్న ఓ విడో ని పేమించడం, ఆ ప్రేమ కోసం తన్నులు తినడం అనే పాయింట్ కాస్త కొత్తగానే అనిపిస్తుంది. కాకపోతే ఆ కథను నడిపించడంలో కాస్తంత కన్ఫ్యూజ్ అయ్యాడు దర్శకుడు. అలాగే హీరో - హీరోయిన్స్ మెయిన్ లీడ్ కథతో పాటుగా హీరో తల్లి (ఆమని ) పాత్రతో మరో ఉప కథను నడిపించాడు. ఆ పాయింట్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం లోనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఫస్టాఫ్ అంతా పుల్ కామెడీగా, సినిమాను బోర్ కొట్టించకుండా నడిపించిన దర్శకుడు సెకండాఫ్ దగ్గర కొంచెం తడబడ్డాడు. సెకండాఫ్ కథ మొత్తం పూర్తిగా సీరియస్ మోడ్ లోకి వెళ్ళడంతో .. ఎంటర్ టైన్ మెంట్ మిస్ అయింది. అలాగే కొన్ని సీన్స్ బోర్ అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ లోని ఎమోషన్స్ కన్నా డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు మెయిన్ లీడ్ మీద రాసుకున్న లవ్ స్టోరీని ఇంకా బెటర్ గా చూపించి ఉంటె బాగుండేది. మొత్తానికి చావుకబురు చల్లగా సినిమా జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది.
సాంకేతికంగా:
జుక్స్ బిజాయ్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ ని నేపధ్య సంగీతం హైలెట్ చేసేదిలా ఉంది. కర్మ్ చావ్లా ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా బస్తీ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడంలో కర్మ్ చావ్లా మంచి పనితీరుని కనబరిచాడు. సత్య ఎడిటింగ్ ఇంకొంత మెరుగ్గా వుంటే బాగుండేది. జీఏ2 పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్: చావు కబురు చల్లగా : సెకండాఫ్ మరీ మెల్లగా.!
రేటింగ్: 2.5/5