Advertisementt

సినీజోష్ రివ్యూ: శ్యామ్ సింగ రాయ్

Fri 24th Dec 2021 02:53 PM
shyam singha roy review,shyam singha roy movie review,shyam singha roy telugu review,nani shyam singha roy review,nani,sai pallvi shyam singha roy review  సినీజోష్ రివ్యూ: శ్యామ్ సింగ రాయ్
Shyam Singha Roy Telugu Review సినీజోష్ రివ్యూ: శ్యామ్ సింగ రాయ్
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: శ్యామ్ సింగ రాయ్ 

బ్యానర్: నిహారిక ఎంటర్టయిన్మెంట్

నటీనటులు: నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, అభినవ్ గోమాటం, రాహుల్ రవీంద్రన్, లీల శాంసన్ మరియు ఇతరులు

సినిమాటోగ్రాఫర్: సాను జాన్ వర్గీస్

మ్యూజిక్ డైరెక్టర్: మీకీ జె మేయరు

ఎడిటర్: నవీన్ నూలి

నిర్మాతలు: వెంకట్ బోయినపల్లి

దర్శకుడు: రాహుల్ సాంకృత్యాన్

నాని ముందు రెండు సినిమాలు 'వి' మరియు టక్ జగదీశ్ థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్  తో మళ్ళీ రెండేళ్ల తరువాత తన సినిమా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. అయితే నాని మాత్రం శ్యామ్ సింగ రాయ్ పై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను అని ప్రమోషన్స్ లో చెప్పారు. మొదటిసారిగా తన సినిమా నాలుగు భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అంత కాన్ఫిడెంట్ ఉండబట్టే నాని ఈ సినిమాకి చాలా గట్టిగా ప్రమోషన్స్ చేసారు. అదీ కాకుండా సాయి పల్లవి ఇందులో ఉండటం ఈ సినిమాకి ఇంకా కొంచెం క్రేజ్ పెరిగింది. అయితే రాహుల్ సాంకృత్యాన్ కి దర్శకుడుగా ఇది మూడో సినిమా. బెంగాల్ నేపధ్యం లో సాగే ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ

వాసుదేవ్ (నాని) సినిమా దర్శకుడు కావాలని అనుకుంటూ ముందుగా ఒక షార్ట్ ఫిలిం తీస్తాడు. అందులో కీర్తి (కృతి శెట్టి) ని కథా నాయికగా ఎంచుకొని వర్ణం అనే షార్ట్ ఫిలిం చేసి ఒక నిర్మాతని మెప్పిస్తాడు. ఆ నిర్మాత నాని కి ఒక సినిమా ఆఫర్ కూడా ఇస్తాడు. సినిమా దర్శకుడిగా మొదటి సినిమా ఉనికి తీసి మంచి సక్సెస్ కూడా అవుతాడు. అయితే అదే సినిమాని హిందీ లో తీయటానికి ఒక నిర్మాత ముందుకు వస్తాడు. ఆ హిందీ సినిమా అనౌన్స్ చేస్తూ ఉండగా, పోలీసులు వాసుదేవ్ ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు చెప్పిన కారణం వాసుదేవ్ తీసిన ఉనికి సినిమా కథ ఒక బెంగాలీ నవల కాపీ కొట్టి చేసాడని. వాసు కేసు వాదించటానికి లాయర్ కీర్తి కజిన్ (మడోన్నా సెబాస్టియన్) వకాల్తా పుచ్చుకుంటుంది. వాసు షార్ట్ ఫిలిం తరువాత సినిమా చేసేటప్పుడు అతనికి ఏవో పాత స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. ఇంతకీ ఈ కథ కాపీ కొట్టి రాయడానికి, ఆ పాత స్మృతులకి, అలాగే శ్యామ్ సింగ రాయ్ కి ఏమైనా సంబంధం వుందా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవలసిన విషయం.

పెర్ఫార్మన్స్

నాని ముందు నుండే చెప్తున్నారు ఈ సినిమా గురించి మరియు ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ అని. అతను అన్నట్టు గానే, నాని రెండు వైవిధ్యమయిన రోల్స్ ని చాలా బాగా మెప్పించారు. ఒక్కటి మోడరన్ రోల్.. దర్శకుడు అవుదామన్న యంగ్ అబ్బాయిగా, రెండోది 1970 లో జరిగే ఒక సోషల్ రెఫార్మెర్ శ్యామ్ సింగ రాయ్ గా. అయితే ఈ రెండో పాత్ర నే సినిమా కి హైలైట్. ఇందులో నాని అద్భుతం గా చేయడమే కాకుండా అలరించారు కూడా. నాని అన్నట్టుగానే ఈ శ్యామ్ సింగ రాయ్ రోల్ తనకి బెస్ట్ అని చెప్పొచ్చు. సాయి పల్లవికి మరో అరుదయిన రోల్ ఈ సినిమాలో దొరికింది. ఇంతకు ముందు చాలా సినిమాల్లో సాయి పల్లవి తన నటనతో అందరిని మెప్పించింది, మళ్ళీ ఈ సినిమాలో కూడా ఒక దేవదాసి రోల్ లో మళ్ళీ అలరించింది. సాయి పల్లవి ఉండటం వల్ల ఈ సినిమాకి ఇంకా కొంచెం హైప్ వచ్చింది. నాని - సాయి పల్లవి సీన్స్ చాల బాగా వచ్చాయి. కృతి శెట్టి ఒక మోడరన్ అమ్మాయిగా కనిపించి తన పరిధిలో చక్కగా చేసింది. అభినవ్ గోమాటం ఐస్ ఒకే. రాహుల్ రవీంద్రన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. మడోన్నా సెబాస్టియన్ లాయరు గా ఒదిగిపోయింది.

విశ్లేషణ

పునర్జన్మ ల మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా కూడా అదే కోవలోకి వచ్చిన, దర్శకుడు ఒక కొత్త పాయింట్ ని చూపించటం బాగుంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఆ  పునర్జన్మ విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసారు. క్లైమాక్స్ కూడా విభిన్నంగా చిత్రీకరించటం బాగుంది. దర్శకుడుగా రాహుల్ మంచి మార్కులు సంపాదించారు. మొదటి భాగం సినిమా అంత ఏదోలా కాస్త స్లోగా సాగుతుంది, కాని మొత్తం సినిమా అంతా రెండో భాగమే. ఇందులో కూడా సాయి పల్లవి నాని మధ్య నడిచే సీన్స్ కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించినా, దర్శకుడికి కథ మీద ఉన్న పట్టుతో మళ్ళీ పుంజుకునేట్టు చేసాడు. సాయి పల్లవి నాని చేయి పట్టుకొని చనిపోయే సీన్ చాలా హైలైట్. దేవదాసి సబ్జెక్టు ని టచ్ చేసినా, దాని మీద మొత్తం కథ నడిపించకుండా అందులో ఆ దేవదాసి సబ్జెక్టు పార్ట్ గా చెయ్యటం బాగుంది. కోర్ట్ సీన్స్ మరీ సినిమాటిక్ గా వున్నాయి.

సాంకేతికంగా

సినిమా సాంకేంతిక పరంగా చూస్తే ఒక్కొక్క సీన్ పెయింట్ లా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ పనితనం గొప్పగా ఉంటుంది. ప్రత్యేకంగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా చాలా గ్రాండ్ గా చూపించారు. సినిమా అంతా చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల కొలకత్తా సెట్ అద్భుతంగా వేశారు. అదంతా చాలా ఒరిజినల్ గా ఉన్నట్టు చూపించారు. నవరాత్రి ఉత్సవాలు బెంగాల్ లో చాలా బాగా చేస్తారు, సినిమా లో కూడా అంతా బాగా చూపించారు. మిక్కీ జె మేయరు సంగీతం బాగుంది, ఈ సినిమాకి అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చేసారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకొక కొత్త రైటర్ సత్యదేవ్ జంగా మన తెలుగు సినిమాకి పరిచయం అయ్యారు. కథ పాతదే అయినా, కొత్తదనం తో వచ్చాడు.

ముగింపు:

శ్యామ్ సింగ రాయ్ అనే సినిమా నాని కెరీర్ లో బెస్ట్ గా నిలుస్తుంది. మధ్యలో కొంచెం సీన్స్ బోర్ కొట్టినా ఓవరాల్ గా ఈ పీరియడ్ డ్రామాని ఒక ఎమోషనల్ సినిమా గా దర్శకుడు రాహుల్ మలిచాడు. నాని, సాయి పల్లవి వాళ్ళ పెర్ఫార్మన్స్ తో ఈ సినిమాని నిలబెట్టారు. వైవిధ్యమయిన క్లైమాక్స్ తో కొత్త కధనం తో ఈ సినిమా నాని కి రాహుల్ కి మంచి పేరు తీసుకువస్తుంది. పరవాలేదు ఒకసారి చూడొచ్చు. 

రేటింగ్: 3/5

Shyam Singha Roy Telugu Review:

Shyam Singha Roy Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ