Advertisementt

సినీ జోష్ రివ్యూ: గని

Fri 08th Apr 2022 02:20 PM
ghani review,ghani movie review,ghani movie telugu review,varun tej ghani review,ghani review rating  సినీ జోష్ రివ్యూ: గని
Cinejosh Review: Ghani సినీ జోష్ రివ్యూ: గని
Advertisement
Ads by CJ

సినీ జోష్ రివ్యూ: గని 

బ్యానర్: రెనసాన్స్ పిక్చర్స్ 

నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, తమన్నా(స్పెషల్ సాంగ్) తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: థమన్

ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్

సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్

నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద

దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి

రిలీజ్ డేట్: 08-04-2022

ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాల్లో లవర్ బాయ్ లా ఆకట్టుకున్న ఆరడుగుల ఆజానుబాహుడు మెగా హీరో వరుణ్ తేజ్.. గద్దలకొండ గణేష్ తో మాస్ యాంగిల్ ట్రై చేసాడు. ఇప్పుడు గని అంటూ బాక్సర్ గా కొత్త అవతారం ఎత్తాడు. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో అల్లు బాబీ మొదటిసారి నిర్మిస్తున్న గని చిత్రంలో బాక్సర్ గా వరుణ్ తేజ్ మేకోవర్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. కోవిడ్, అలాగే ఇతర కారణాలతో బోలెడన్ని రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ చివరికి ఏప్రిల్ 8 బన్నీ బర్త్ డే రోజున వరుణ్ తేజ్ గని ఆడియన్స్ ముందుకు వచ్చింది. గని తో వరుణ్ తేజ్ ప్రేక్షకులను ఎంతవరకు అలరించాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం..

కథ:

గని కథ ఏమిటి అనేది గని ట్రైలర్ లోనే రివీల్ చేసేసారు. తన తల్లికి బాక్సింగ్ చెయ్యను అని మాట ఇచ్చిన గని.. బాక్సింగ్ నే లక్ష్యంగా పెట్టుకుని గెలుపు ఎలా సాధించాడో అనేది గని కథ.

మాధురి (నదియా) తన జీవితంలో జరిగిన ఓ చేదు ఘటన కొడుకు గని జీవితంలో జరగకూడదు అని చిన్నప్పుడే కొడుకు గని (వరుణ్ తేజ్) దగ్గర లైఫ్ లో ఇక బాక్సింగ్ జోలికి వెళ్లను అని మాట తీసుకుంది. కానీ గని కి చిన్నప్పటి నుండే బాక్సింగ్ అంటే ప్రాణం. తల్లికిచ్చిన మాటను కూడా పక్కనబెట్టి తల్లికి తెలియకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. పోటిలలో పాల్గొంటూ బాక్సింగ్ లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే మాయ (సాయి మంజ్రేకర్) గని ప్రేమలో పడుతుంది. తల్లికి నచ్చని బాక్సింగ్ ని జీవితంలో ఓ లక్ష్యంగా చేసుకున్న గని బాక్సింగ్ లో ఛాంపియన్ అయ్యాడా? అసలు గని తండ్రి వలన తల్లికి జరిగిన అవమానం ఏమిటి?  తల్లి మాటను దాటిన గని తల్లికి ఏం సమాధానం చెప్పాడు? మాయ ప్రేమని గని ఒప్పుకున్నాడా?  ఈశ్వర్ నాథ్ (జగపతిబాబు)కి గని తండ్రికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

నటీనటులు:

వరుణ్ తేజ్ ఆరడుగుల ఆజానుబాహుడు. అందుకే బాక్సర్ లుక్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. గని గా అటు లుక్స్ అండ్ నటన పరంగా ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ తో తన యాక్షన్ మూమెంట్స్ తో సినిమాకే హైలెట్ గా నిలిచాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ లోను వరుణ్ తేజ్ మంచి పెరఫార్మెన్స్ చూపించాడు. ఇక వరుణ్ తేజ్ కటౌట్ కి సరిపోయే హీరోయిన్ గా బాలీవుడ్ నుండి సాయి మంజ్రేకర్ ని బాగానే పట్టుకొచ్చారు. కానీ ఆమె కాస్త బాబ్లీ గా కనిపించడమే కాదు.. కేరెక్టర్ లో చాలా వీక్ గా ఉంది. అలాగే వరుణ్ తేజ్ - సాయి మధ్యన రొమాంటిక్ సీన్స్ అంతగా పండలేదు. ఇక సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్రలని ఆయా పాత్రలకి ఎంచుకుని దర్శకుడు మంచి పని చేసాడు. చిన్న పాత్రలే అయినా వారు లుక్స్ పరంగా నటన పరంగా ఆకట్టుకున్నారు. ఇక గని తల్లిగా నదియా మంచి పెరఫార్మెన్స్ చూపించింది. మిగతా వారు తమ పరిధిమేర చేసుకుంటూ పోయారు.

విశ్లేషణ:

ఇప్పుడు ఆ భాషా లేదు ఈ భాష లేదు.. అన్ని భాషల్లోనూ స్పోర్ట్స్ డ్రామాలు సినిమాలుగా వస్తున్నాయి. అయితే స్పోర్ట్స్ డ్రామా అనగానే అందులో జరిగే పాలిటిక్స్ అనేది కామన్ పాయింట్. కానీ దానికి ఎమోషనల్ టచ్ ఇస్తూ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా చూపిస్తేనే ఆ డ్రామా పండుతుంది. కిరణ్ కొర్రపాటి అనే డెబ్యూ డైరెక్టర్ వరుణ్ తేజ్ ని హీరోగా పెట్టి బాక్సింగ్ నేపథ్యంలో గని మూవీని తెరకెక్కించాడు. గతంలో బాక్సింగ్ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాతో మంచి హిట్ కొడితే.. అమ్మ నాన్న తమిళ అమ్మాయి తో రవితేజ హిట్ అందుకున్నారు. అలానే వరుణ్ తేజ్ గని ఊహించుకుని థియేటర్ కి వెళితే ఆడియన్స్ డిస్పాయింట్ అవడం ఖాయం. ఇక సినిమాలోకి వెళితే ఫస్ట్ హాఫ్ లో వరుణ్ తేజ్ చిన్నప్పటి నుండి బాక్సర్ అవ్వాలనే కోరిక, దానికి తల్లి అడ్డు, హీరో కాలేజ్ సన్నివేశాలు, హీరోయిన్ ఎంట్రీ ఇవన్నీ సరదాగా ఆహ్లాదంగా సాగిపోలేదు. తల్లితో గని ఎమోషనల్ సన్నివేశాలు సరిగ్గా పండవు. ఇక నరేష్ కోచ్ గా ఎంట్రీ ఎవరూ ఊహించారు. నవీన్ చంద్ర తో గొడవ రొటీన్ గా ఉంటుంది. కాలేజ్ ఎపిసోడ్ కూడా అనవరసం అనిపించేలా ఉంది. దానితో సెకండ్ హాఫ్ పై అంచనాలు ఉండవు. కానీ సెకండ్ హాఫ్ లో ఉపేంద్ర ఫ్లాష్ బ్యాక్ తో కథ మలుపు తిరుగుతుంది. ఆ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉన్నా.. మళ్ళీ స్పోర్ట్స్ పాలిటిక్స్ రొటీన్ డ్రామాని తలపిస్తాయి. తర్వాత రివెంజ్ డ్రామా.. తండ్రిని మోసం చేసిన వాడిపై హీరో పగ తీర్చుకోవడం, నేషనల్ ఛాంపియన్ గా హీరో ఎలా అయ్యాడో చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కనిపించనే లేదు. కాకపోతే మరీ డ్రై గా కనిపించకుండా తమన్నా స్పెషల్ సాంగ్ పెట్టి కథ నడిపించేసారు. లేదంటే సెకండ్ హాఫ్ కూడా బోర్ కొట్టేసేది. సినిమాలో వరుణ్ తేజ్ తప్ప మరో ప్లస్ పాయింట్ కనిపించలేదు. యాక్షన్ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచేయడం కూడా సినిమాకి మైనస్. సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా… దర్శకుడు ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. 

సాంకేతికంగా:

ప్రెజెంట్ సక్సెస్ ట్రాక్ లో ఉన్న థమన్ ఇచ్చిన బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ గని కి ప్లస్ అయ్యింది. కానీ  పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. బాక్సింగ్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో వచ్చే దృశ్యాలన్నీ ఆయన చాలా బాగా చూపించారు. అబ్బూరి రవి డైలాగ్స్ సో సో గా అనిపిస్తాయి. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

రేటింగ్: 2.25/5

Cinejosh Review: Ghani:

Ghani Movie Telugu review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ