Advertisementt

సినీ జోష్ రివ్యూ: ఎఫ్ 3

Fri 27th May 2022 02:01 PM
f3 movie,f3 movie review,f3 telugu review,f3 review,anil ravipudi f3 review,venkatesh f3 review,varun tej f3 review  సినీ జోష్ రివ్యూ: ఎఫ్ 3
Cinejosh Review: F3 సినీ జోష్ రివ్యూ: ఎఫ్ 3
Advertisement
Ads by CJ

సినీ జోష్ రివ్యూ: ఎఫ్ 3 

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్, సోనాల్ చౌహన్, మురళి శర్మ, సునీల్, అలీ, రాజేంద్రప్రసాద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీ రామ్

ఎడిటింగ్: తమ్మిరాజు 

నిర్మాత: దిల్ రాజు, శిరీష్

దర్శకత్వం: అనిల్ రావిపూడి

రిలీజ్ డేట్: 27-05-2023 

2019 సంక్రాంతి టైం లో స్టార్ హీరోల తో పోటీ పడి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫన్ అండ్ ప్రష్టేషన్ F2 తో వెంకీ-వరుణ్ తేజ్ కేరెక్టర్ తో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించిన అనిల్ రావిపూడి.. మళ్ళీ తన సక్సెస్ ఫుల్ హీరోలతో F2 కి సీక్వెల్ గా సక్సెస్ ఫార్ములా నవ్వుల ఫ్రాంచైజీ అంటూ ఎఫ్ 3 ని తెరక్కిస్తున్నప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మోర్ ఫన్ అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడం, వెంకటేష్, వరుణ్ తేజ్ ల కామెడీ తో F3 ట్రైలర్ కట్ చెయ్యడంతో.. సినిమాపై ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. సమ్మర్ సోగ్గాళ్లుగా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించిన వెంకీ అండ్ వరుణ్ తేజ్ తో అనిల్ రావిపూడి చేయించిన కామెడీ ఎంటర్టైనర్ F3 నేడు భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి F2 తో ప్రేక్షకులని నవ్వించిన ఈ కాంబో.. F3 తో ఏ మాత్రం ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందో అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ:

వెంకీ (వెంకటేష్) కి ఫ్యామిలీ సమస్యలు, వరుణ్ (వరుణ్ తేజ్)ది డబ్బు కోసం కాస్ట్లీ కలలు కనే మనసు. అటు వెంకీ ఇటు వరుణ్ ఫైనల్ టార్గెట్ డబ్బే. ఆ డబ్బు కోసం మరో ఖరీదైన అమ్మాయికి వల వేద్దామని.. హారిక (తమన్నా) హాని(మెహ్రీన్ పర్) ఫ్యామిలీ ట్రాప్ లో పడతాడు వరుణ్. వరుణ్ కలల వలన వెంకీ కూడా అప్పుల పాలవుతాడు. హారిక ఫ్యామిలీ, వెంకీ, వరుణ్ అంతా అప్పులపాలై ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న టైం లో వాళ్ళకి విజయనగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ) చిన్నప్పుడే తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతున్నాడని అని తెలుస్తుంది. అప్పులపాలైన వెంకీ, వరుణ్ అలాగే తమన్నా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్లి.. ఎవరికీ వారు కొడుకుగా నమ్మించి ఆనంద్ ప్రసాద్ కోట్లాది ఆస్తికి వారసులు కావాలని చూస్తారు. మరి ఆనంద్ ప్రసాద్ తన కొడుకుగా ఎవరిని స్వీకరిస్తాడు? ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు ఏమిటి ? వరుణ్, వెంకీ అప్పులు సమస్యల నుండి బయటపడతారా? హారిక ఫ్యామిలీ కథ ఏమిటి? అనేది F3 థియేటర్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:

F2 లో కోబ్రాలుగా(కో బ్రదర్స్) వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ చేసిన సందడి.. F3 లో మోర్ ఫన్ అనేలా నిజంగా అదరగొట్టేసారు. సీనియర్ హీరో అయినా.. వెంకీ తన ఇమేజ్ ని పక్కనబెట్టి రే చీకటి ఉన్న వ్యక్తిగా కామెడీ టైమింగ్ తో అదరగొట్టేసాడు. వెంకీ కామెడీ ని ఆడియన్స్ ప్రతిసారి ఎంజాయ్ చేసారు. వరుణ్ తేజ్ కూడా కామెడీ కేరెక్టర్ లో వదిగిపోయాడు. తెలంగాణ యాస మాట్లాడుతూ నత్తి ఉన్న అబ్బాయిగా వరుణ్ నవ్వించాడు. తమన్నా, మెహ్రీన్ కౌర్, సోనాల్ చౌహన్ అల్లరిగా, గ్లామర్ గా ఆకట్టుకున్నారు. ఇక రాజేంద్ర ప్ర‌సాద్ చేసిన నాగ‌రాజు పాత్ర‌.. అలీ చేసిన పాల బేబీ పాత్ర‌, సునీల్, వెన్నెల కిషోర్ కాస్త నవ్వించారు. మిగతా పాత్రలు పరిధిమేర నటించి మెప్పించారు.

విశ్లేషణ:

కామెడీ కి కేరాఫ్ అడ్రెస్ అయిన అనిల్ రావిపూడి F2 తో ఎలాంటి అంచనాలు లేకుండానే బ్లాక్ బస్టర్ కొట్టి దానికి సీక్వెల్ చేస్తున్నాం F3 రాబోతుంది అన్నప్పుడే కామెడీ ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యారు. F2 కి సీక్వెల్ అన్నప్పటికీ.. F3 ని కొత్తగా చూపించడానికి అనిల్ రావిపూడి హీరోలపై రే చీకటి, నత్తి ప్రయోగం చేసి దానినుండి కామెడీ జనరేట్ చేసాడు. అనిల్ రావిపూడి చేసిన కామెడీ ప్రయోగం ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యింది. మాస్ మూవీస్, యాక్షన్ మూవీస్ తో బోర్ కొట్టిన ఆడియన్స్ ని వేసవిలో కూల్ గా కామెడీ ని ఎంజాయ్ చేసే విధంగా F3 ని మలిచిన తీరు అభినందనీయం. అయితే అనిల్ రావిపూడి F2 లో ఉన్న లాజిక్ కి దూరంగా F3 ని మలిచాడు. లాజిక్ లేని కామెడీని చూపించాడు. F3 మొత్తం డబ్బు చుట్టూ తిరిగే కథ. డబ్బు కోసం అడ్డదార్లు తొక్కేందుకు వెనుకాడని హీరోలు, హీరోయిన్లు. ఇక ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ తన రే చీకటి ఉందనే విషయం తెలియకుండా దాచేందుకు పడే పాట్లు ఫన్ జనరేట్ చేసాయి. డబ్బు కోసం ఏమైనా చేసే స‌న్నివేశాల‌ను బేస్ చేసుకుని క్రియేట్ చేసిన కామెడీ ఫ‌స్టాఫ్ అంతా న‌వ్విస్తుంది. అస‌లు క‌థ ఏంట‌నేది ఇంట‌ర్వెల్‌లో తెలుస్తుంది. 

ఇక సెకండాఫ్‌లో హీరోల తో సహా ఆయన ఫ్యామిలీలు, హీరోయిన్స్ ఫ్యామిలీ అంతా వ్యాపారవేత్త ముర‌ళీ శ‌ర్మ ఇంట్లో చేరుతారు. మురళి శర్మ వారసుడి విషయంలో పోటీ పడే సన్నివేశాల్లో కామెడీ పండింది. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ మెప్పించేలా కామెడీ ఉండకపోవడం మైనస్, సోనాలి చౌహాన్ పాత్ర ఎందుకు వ‌స్తుందో పోతుందో తెలియ‌దు. ఇక క‌థ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యం స‌గ‌టు ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోతుంది. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌థ కంటే కామెడీ స‌న్నివేశాల‌పైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టిన‌ట్లు అనిపించింది. క్లైమాక్స్‌, దాని ముందు వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ కామెడీగా కాకుండా.. కమర్షియల్ గా మలచడం, చివరిలో వరుణ్, వెంకీ చేసే ఫైట్స్ సీన్స్ కూడా కమర్షియల్ గా అనిపించడం, చివ‌ర‌లో వెంక‌టేష్ నార‌ప్ప‌గా, వ‌రుణ్ తేజ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ‌కీల్ సాబ్ పాత్ర‌లో మెప్పించాల‌నుకోవ‌డం అన్నీ క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లోనే సాగిపోతుంది. లాజిక్ లు తీసి పక్కనబెడితే ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో కలిసి ఫన్ ని ఎంజాయ్ చేసే సినిమాగా F3 మిలిగిపోతుంది. 

సాంకేతికంగా..

దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో పాట‌లు ఆక‌ట్టుకునేంత‌గా ఏదీ లేదు. ఇక నేప‌థ్య సంగీతం కూడా అంతంతే. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా సాయి శ్రీ రామ్ చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకెండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. దిల్ రాజు నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

ఫంచ్ లైన్: లాజిక్స్ లేని మేజిక్

రేటింగ్: 3/5

Cinejosh Review: F3:

F3 Movie Telugu review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ