Advertisementt

సినీజోష్ రివ్యూ: టిల్లు స్క్వేర్

Fri 29th Mar 2024 03:19 PM
tillu square review  సినీజోష్ రివ్యూ: టిల్లు స్క్వేర్
Cinejosh Review: Tillu Square సినీజోష్ రివ్యూ: టిల్లు స్క్వేర్
Advertisement
Ads by CJ

సినీజోష్ రివ్యూ: టిల్లు స్క్వేర్ 

బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్ 

నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీధర్ గౌడ్, ప్రిన్స్, మురళి శర్మ తదితరులు 

మ్యూజిక్: రామ్ మిర్యాల, అచ్చు రమణి 

BGM: భీమ్స్ సిసిరోలియా 

సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు 

ఎడిటింగ్: నవీన్ నూలి 

రచన: సిద్ధు జొన్నలగడ్డ, రవి ఆంటోనీ

ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

డైరెక్టర్: మల్లిక్ రామ్ 

రిలీజ్ డేట్: 29-03-24

DJ టిల్లు 

టాలీవుడ్ లో ఓ స్ట్రాంగ్ ఫ్రాంచైజీగా మారింది 

సిద్దు జొన్నలగడ్డ ని స్టార్ బాయ్ గా మార్చేసింది. 

టిల్లు క్యారెక్టరైజేషన్ తో ఆడియన్స్ పల్స్ పట్టేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. క్రేజీ కామెడీ, ట్రెండీ రొమాన్స్, థ్రిల్లింగ్ ట్విస్ట్ అనే ఎలిమెంట్సే బేసిక్ గా టిల్లు టార్గెట్. మళ్ళీ అదే టెంప్లేట్ ఫాలో అయిపోతూ ఈసారి డబుల్ డోస్ తో టిల్లు స్క్వేర్ ని తెరపైకి తెచ్చారు. ఈ మూవీలోని అనుపమ హాట్ లుక్స్ అండ్ సిద్ధుతో ఆమె కెమిస్ట్రీ ఫ్రమ్ ది బిగినింగ్ యూత్ ని విపరీతంగా ఎట్రాక్ట్ చేశాయి. ఇక సిద్దు జొన్నలగడ్డ గురించి చెప్పక్కర్లేదు... సినిమా అనౌన్సుమెంట్ దగ్గర్నుంచి పోస్టర్ డిజైన్స్,  సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ వరకూ అన్నిట్లోనూ టిల్లు మార్క్ క్యారీ అయ్యేలా చూసాడు, ప్రేక్షకులు ఆకర్షితులయ్యేలా చేసాడు. అందుకే అన్నిచోట్లా మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న టిల్లు స్క్వేర్ ఆన్ స్క్రీన్ ఎంతవరకూ ఇంప్రెస్ చేయగలిగాడో రివ్యూలో చూద్దాం.!

టిల్లు స్క్వేర్ స్టోరీ: బాహుబలి, KGF, సలార్, పుష్ప, దేవర వంటి భారీ బడ్జెట్ చిత్రాలే తప్ప మీడియం రేంజ్ సినిమాల్లో అదే కథని కొనసాగిస్తూ సీక్వెల్ రావడం అనేది అరుదు. ఆ అరుదైన ప్రయత్నానికే పూనుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. DJ టిల్లు ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచే టిల్లు స్క్వేర్ కథని స్టార్ట్ చేయడంతో పాటు ప్రీవియస్ ఫిలిం కీ దీనికీ ఓ స్ట్రాంగ్ లింక్ కూడా సెట్ చేస్కోవడం విశేషం. తన లవర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని ఈవెంట్ ఆర్గనైజర్ గా ఎదిగిన టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) లైఫ్ లోకి ఈసారి లిల్లి  (అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. ఒక పార్టీ లో ఆమెతో ఏర్పడ్డ పరిచయం, జరిగే ఫ్లర్టింగ్ అదే రాత్రి వాళ్లిద్దరూ శారీరకంగా కలిసిపోయేవరకు వెళుతుంది. అయితే మరునాటి ఉదయానికి గుడ్ బై అని నోట్ రాసి పెట్టి వెళ్ళిపోయిన లిల్లీ... మరికొన్ని రోజుల తరువాత తాను ప్రెగ్నెంట్ అయ్యానంటూ మళ్ళీ వస్తుంది. పెళ్లి చేసుకోమంటుంది. ఇటు లిల్లీ ప్రెజర్ చేయడం.. అటు ఇరు కుటుంబాలు ఓకే అనడంతో పెళ్ళికి ఒప్పుకుంటాడు టిల్లు. అయితే ఫస్ట్ పార్ట్ లో రాధిక (నేహా శెట్టి) చంపేస్తే తాను పాతిపెట్టిన రోహిత్ (కిరీటి రామరాజు)కి లిల్లీ చెల్లెలని తెలియడంతో షాక్ అవుతాడు టిల్లు. ఇక ఇక్కడ్నుంచి కథ అనేక మలుపులతో పరుగులు పెడుతుంది. అసలు లిల్లీ - టిల్లు లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, ఆపై టిల్లు ఎన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నదే టిల్లు స్క్వేర్ స్టోరీ. కథగా కాసింతే వున్నా కథనంలో మాత్రం సిద్దు మార్క్ చమక్కులు చాలానే ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ చాప్టర్ లో చర్చిద్దాం.

టిల్లు స్క్వేర్ స్క్రీన్ ప్లే: టిల్లు గాని జిందగీ లోకి ఒక పోరీ రావాలె, గాన్ని ఆగమాగం జెయ్యాలె... అనేదే బేసిక్ కాన్సెప్ట్ గా పెట్టుకుని మళ్ళీ అదే కథ రాసుకోవడం కష్టమైన పనే. అయితే టిల్లు స్క్వేర్ విషయంలో కథ కంటే కథనం బాగా వర్కవుట్ అయింది. సిద్దు జొన్నలగడ్డ టైమింగ్ భలే మ్యాజిక్ చేసింది. పూర్తిగా టిల్లు క్యారెక్టరైజేషన్ పైనే బేస్ అయిపోయి తెరపై కదిలిన కథనం ఇది. సినిమా టేక్ ఆఫ్ లోనే  సిద్దు తనదైన నటనతో టిల్లుని తీసుకెళ్లి ప్రేక్షకుల దిల్లులో పెట్టేసాక - ఇక ఆ రోల్ తో కనెక్ట్ అయిన ఆడియన్స్ వాడి ఫ్రస్ట్రేషన్ లోని ఫన్ ని ఎంజాయ్ చేస్తూ మూవీ మొత్తం చూసేస్తారు. ఫస్టాఫ్ అంతా ప్రెడిక్టబుల్ గానే ఉన్నా టిల్లు గా సిద్దు చేసిన హడావిడి, హంగామాలో అది కొట్టుకుపోతుంది. ఆపై సెకండాఫ్ క్రెడిట్ టోటల్ గా రైటింగ్ డిపార్ట్ మెంట్ పట్టుకుపోతుంది. నిజానికి ఆన్ పేపర్ రాసుకున్న కంటెంట్ కంటే... ఆన్ లొకేషన్ యాడ్ అయిన ఇన్ స్టెంట్ స్టఫ్ ఎక్కువుందేమో అనిపించేలా ఉంది టిల్లు స్క్వేర్. అలాగే కొన్ని సీన్స్ కోసం బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని హిట్ సాంగ్స్ ని యూజ్ చేసిన విధానం హిలేరియస్ గా పేలింది. ఓవరాల్ గా సెన్స్ అఫ్ హ్యూమర్ తో పాటు సెన్స్ అఫ్ స్క్రీన్ లాంగ్వేజ్ కూడా కలిగి ఉన్నప్పుడే ఇలాంటి సీక్వెల్స్ తో ఆడియన్సుని మళ్ళీ మళ్ళీ ఆకట్టుకోగలం అనిపించేలా ఉంది టిల్లు స్క్వేర్.

టిల్లు స్క్వేర్ ఎఫర్ట్స్: నిస్సందేహంగా ఇది సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. టిల్లు క్యారెక్టర్ కోసం ఓ పెక్యులియర్ అప్పీయరెన్స్ డిజైన్ చేసుకున్న సిద్దు ఆ పాత్ర ప్రవర్తన, పలికే డైలాగ్స్ పట్ల కూడా ఎంత కేర్ తీసుకుంటున్నాడో స్క్రీన్ పై స్పష్టంగా తెలుస్తోంది. మెయిన్ గా తనే రైటర్ కావడం సిద్ధుకి పెద్ద ప్లస్ అయింది. అందుకే సిద్దు బోయ్ వన్ లైనర్స్ ని థియేటర్స్ లో యూత్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ ఇంతటి బోల్డ్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ తరహా పాత్రలకూ తనను కన్సిడర్ చేయొచ్చు అని చాటుకునేలా తెరపై రెచ్చిపోయిన అనుపమ హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ హార్ట్స్ ని కెలికేసింది. DJ టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఈ టిల్లు స్క్వేర్ లోనూ కాసేపు కనిపించి మెరుపులు మెరిపించింది. ప్రిన్స్ ఇంప్రెస్ చేసాడు.. మురళీశర్మ గెస్ట్ రోల్ లాంటిది పొందాడు. సిద్దు ఫాదర్ రోల్ చేసిన బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ ముచ్చటగా నవ్వులు పంచి మరోసారి నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు. అలాగే టిల్లుకి ఫుల్లుగా సపోర్ట్ చేసింది టెక్నికల్ టీమ్. రామ్ మిరియాల - అచ్చు రాజమణి అందించిన పాటలు సినిమా ఫ్లో లో పర్ ఫెక్ట్ గా మెర్జ్ అవ్వగా... భీమ్స్ నేపథ్య సంగీతం కథనానికి కరెక్టుగా అమరింది. ఇక టిల్లు ని కలర్ ఫుల్ గా తెరపైకి తేవడంలో సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్ రాణిస్తే.. ఎడిటింగ్ లో నవీన్ నూలి తన నైపుణ్యం చూపించాడు. ప్రొడ్యూసర్స్ నాగవంశీ - సాయి సౌజన్యల నిర్మాణానికి వంక పెట్టలేం. డైరెక్టర్ మల్లిక్ రామ్ ని అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే సేమ్ DJ టిల్లు ఫార్మేట్ నే ఫాలో అవుతూ మరోసారి అదే టెంప్లేట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్సుని ఒప్పించడం, మెప్పించడం ఈజీ కాదు. ఆఫ్ కోర్స్, ఈ విషయంలో మల్లిక్ రామ్ కి సిద్దు సహకారం ఎంతో ఉన్నప్పటికీ ఆన్ స్క్రీన్ ఎక్సిక్యూషన్ విషయం లో దర్శకుడిగా తన ప్రతిభ ప్రదర్శించాడు మల్లిక్ రామ్.

టిల్లు స్క్వేర్ ఎనాలసిస్: కావాల్సినంత కామెడీని  - కవ్వించే రొమాన్సుని ఆఫర్ చేస్తూ కన్విన్సింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చిన టిల్లు స్క్వేర్ టార్గెటెడ్ ఆడియన్సుని ఫుల్లుగా శాటిస్ ఫై చేసేస్తాడు. డైలాగ్స్ లో ఘాటు పెరగడం, రొమాన్స్ డోస్ ఎక్కువవడం ఫ్యామిలీ ఆడియన్సుని కాస్త ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ యూత్ అండ్ మాస్ ఆడియన్స్ కి మాత్రం మాంఛి కిక్ ఇస్తాయి. ముఖ్యంగా DJ టిల్లు చూసి ఇంప్రెస్ అయిన జనాన్ని టిల్లు స్క్వేర్ మరింత మెప్పిస్తుంది.  ఇప్పటికే హ్యూజ్ ఓపెనింగ్స్ తో, పాజిటివ్ రిపోర్ట్స్ తో థియేట్రికల్ రన్ స్టార్ట్ చేసిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ సూపర్ హిట్ కొట్టెయ్యడం ఖాయంగానే కనిపిస్తోంది. టిల్లు ఫ్రాంచైజీ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈసారి మరింత భారీ అంచనాలను సూచిస్తోంది. కమాన్ సిద్దూ... TILLU Fans Are Eying On Your Hattrick.  

సినీజోష్ రేటింగ్: 3/5

పంచ్ లైన్: సిద్దు బోయ్ వన్ మ్యాన్ షో !

Cinejosh Review: Tillu Square :

Tillu Square Telugu Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ