Advertisementt

మంచి సినిమాకి మంచి వసూళ్లు: శ్రీకాంత్ అడ్డాల

Thu 25th Dec 2014 06:30 AM
mukunda,srikanth addala,srikanth addala about mukunda success,mukunda telugu movie,mukunda movie success details,srikanth addala director,srikanth addala director,varun tej  మంచి సినిమాకి మంచి వసూళ్లు:  శ్రీకాంత్ అడ్డాల
మంచి సినిమాకి మంచి వసూళ్లు: శ్రీకాంత్ అడ్డాల
Advertisement
Ads by CJ
>మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తే్జ్ ని హీరోగా పరిచయం చేస్తూ, ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన 'ముకుంద' ఈ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. మెగా కుటుంబం నుంచి వస్తున్న హీరో కావడంతో ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ చిత్రం తామూహించినట్లుగానే మంచి వసూళ్లు రాబడుతోందని చిత్రదర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు.

>మరిన్ని విశేషాలను శ్రీకాంత్ అడ్డాల చెబుతూ - "మంచి సినిమా కాబట్టి, మంచి ఓపెనింగ్స్ రాబడుతోంది. మామూలుగా నాన్ హాలిడే నాడు ఓ కొత్త హీరో సినిమా విడుదల చేయడం రిస్క్. కానీ, సినిమా మీద నమ్మకంతో బుధవారం నాడు విడుదల చేశాం. నాగబాబుగారి అబ్బాయి పరిచయ చిత్రాన్ని కొత్తగా చేద్దామని ప్రయత్నం చేశాం. నా కొత్త ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వసూళ్లు ఉన్నాయి. మౌత్ టాక్ బాగుంది. వరుణ్ స్ర్కీన్ ప్రెజెన్స్ బాగుందని అందరూ అంటున్నారు. సంభాషణలకు మంచి పేరొచ్చింది. ఇది ఫీల్ గుడ్ మూవీ అనీ, కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉందని అందరూ అంటున్నారు. ఇంత మంచి విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు  ధన్యవాదాలు" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ