అంధుల సమస్యల నేపథ్యంలో ఒక విభిన్న కథాంశంతో అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మిణుగురులు’ చిత్రానికి ఎన్నో ప్రశంసలు లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆస్కార్ అవార్డు చిత్రాల నామినేషన్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అయోధ్యకుమార్: 323 చిత్రాలు ఆస్కార్ అవార్డుల పోటీలో వుండగా వాటిలో ‘మిణుగురులు’ చిత్రానికి కూడా స్థానం లభించడం విశేషం. అలాగే ఆస్కార్ చిత్రాల లైబ్రరీలో ఈ చిత్రాన్ని స్టోర్ చేసుకోడానికి అనుమతి తీసుకోవడం జరిగింది. అలా అనుమతి తీసుకున్న మొదటి తెలుగుచిత్రం మిణుగురులు కావడం చాలా సంతోషంగా వుంది. అయితే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పిల్లల సినిమాలకు ట్యాక్స్ మినహాయింపుతోపాటు అనేక రాయితీలు కల్పిస్తున్నారు. మన ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కూడా పిల్లల చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం.
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ: ఇది చాలా మంచి చిత్రం. ఇలాంటి చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం వుంది.
ఎన్.శంకర్: అయోధ్య కుమార్ రూపొందించిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకి ఎంపిక కావడం చాలా సంతోషంగా వుంది.