Advertisementt

జనవరి 2న వస్తున్న ‘కల్పన గెస్ట్‌ హౌస్‌’

Sun 28th Dec 2014 04:34 AM
telugu movie kalpana guest house,madhu shalini in kalpana guest house,kalpana guest house director kumar,kalpana guest house movie music director sadhu kokila,kalpana guest house releasing on 2nd january,horror movie kalpana guest house    జనవరి 2న వస్తున్న ‘కల్పన గెస్ట్‌ హౌస్‌’
జనవరి 2న వస్తున్న ‘కల్పన గెస్ట్‌ హౌస్‌’
Advertisement
Ads by CJ

మధుశాలిని నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్‌ చిత్రాన్ని తెలుగులో ‘కల్పన గెస్ట్‌ హౌస్‌’ పేరుతో అనువదిస్తుండడం తెలిసిందే. వేణు హీరోగా, థ్రిల్లర్‌ మంజు ముఖ్య పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి కుమార్‌ దర్శకత్వం వహించారు. సాధుకోకిల సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆంధ్ర`తెలంగాణ రాష్ట్రాల్లో జనవరి 2న అత్యధిక ధియేటర్లలో విడులవుతోంది. డి.పూర్ణకళ సమర్పణలో.. శ్రీకాణిపాక వరసిద్ది వినాయక పిక్చర్స్‌ పతాకంపై కడియాల సుబ్రహ్మణ్యం`మాస్టర్‌ జస్వంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని నిర్మాత కడియాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘హారర్‌ సినిమాలు ఇష్టపడేవాళ్లను అమితంగా ఆకట్టుకునే సినిమా ‘కల్పన గెస్ట్‌ హౌస్‌’. మన తెలుగమ్మాయి మధుశాలినికి తమిళంలో విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఫస్ట్‌ రీల్‌ నుంచి లాస్ట్‌ రీల్‌ వరకు ఆద్యంతం భయపెడుతూ వినోదాన్ని పంచుతుంది. సాధుకోకిల అందించిన బాణీలతోపాటు.. రీ`రికార్డింగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాకుండా డబ్బింగ్‌ చేసాం. జనవరి 2న అత్యధిక ధియేటర్లలో విడుదలవుతున్న ‘కల్పన గెస్ట్‌హౌస్‌’ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది’’ అన్నారు!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ