Advertisementt

‘కాలింగ్‌బెల్‌’ ట్రైలర్‌ విడుదల.!

Sun 28th Dec 2014 12:21 PM
telugu movie calling bell,calling bell trailer released by hero srikanth,ravi varma in calling bell,calling bell movie diredtor panna royal,calling bell movie producer anood,calling bell movie music director sukumar p. vrithi khanna in calling bell  ‘కాలింగ్‌బెల్‌’ ట్రైలర్‌ విడుదల.!
‘కాలింగ్‌బెల్‌’ ట్రైలర్‌ విడుదల.!
Advertisement
Ads by CJ

రవివర్మ, కిషోర్‌, సంకీర్త్‌, వ్రితి ఖన్నా ప్రధాన పాత్రల్లో గోల్డెన్‌ టైమ్‌ పిక్చర్స్‌ పతాకంపై పన్నా రాయల్‌ దర్శకత్వలో అనూద్‌ నిర్మిస్తున్న హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ ‘కాలింగ్‌బెల్‌’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ ` ‘‘హార్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మా ‘కాలింగ్‌బెల్‌’ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన హీరో శ్రీకాంత్‌గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆద్యంతం ఆడియన్స్‌ని ఈ సినిమా థ్రిల్‌ చేస్తుంది. ప్రతి సీన్‌ని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు. వివేక్‌గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఈ చిత్రానికి ఉపయోగించిన గ్రాఫిక్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసి విడుదల చేస్తాము’’ అన్నారు.

నిర్మాత అనూద్‌ మాట్లాడుతూ ` ‘‘హార్రర్‌ సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఆ సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో వుండాలి. ఆ స్టాండర్స్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తూ ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన క్వాలిటీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. హార్రర్‌ సినిమాలో మ్యూజిక్‌కి ఎంతో ప్రాధాన్యత వుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాటలు, రీ`రికార్డింగ్‌ విషయంలో ఎక్కువ కేర్‌ తీసుకున్నాం. ఈ చిత్రంలోని పాటల్ని టాప్‌ సింగర్స్‌ అయిన కార్తీక్‌, బాబా సెహగల్‌, గీతా మాధురి, ప్రణవి, శ్రావణ భార్గవిలతో పాడిరచడం జరిగింది. సుకుమార్‌గారు రీ`రికార్డింగ్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

జీవా, గాంధీ, చంటి, శంకర్‌, వేణు, మమతా రాహుల్‌ మిగతా పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్‌ పి., సినిమాటోగ్రఫీ: వివేక్‌ యస్‌.కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: షాని సోలోమన్‌, నిర్మాత: అనూద్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: పన్నా రాయల్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ