Advertisementt

అమ్మ రాజశేఖర్‌ ‘రణం`2’ పాటలు విడుదల

Mon 29th Dec 2014 04:12 AM
ranam 2 audio launch,amma rajasekhar new movie ranam 2,ranam 2 audio released,telugu movie ranam 2 audio release photos,ranam 2 movie director amma rajasekhar,regina in ranam 2,aarthi agarwal in ranam 2  అమ్మ రాజశేఖర్‌ ‘రణం`2’ పాటలు విడుదల
అమ్మ రాజశేఖర్‌ ‘రణం`2’ పాటలు విడుదల
Advertisement
Ads by CJ

గోపీచంద్‌తో ‘రణం’ చిత్రాన్ని రూపొందించిన అమ్మ రాజశేఖర్‌ లేటెస్ట్‌గా తాను నటిస్తూ ‘రణం2’ పేరుతో ఓ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. విక్టరీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర మూవీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస యాదవ్‌. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని హీరో గోపీచంద్‌కి అందించారు.  ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ పెన్‌డ్రైవ్‌ సాంగ్స్‌ ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు. హీరో గోపీచంద్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా..

సి.కల్యాణ్‌: రణంలాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన అమ్మ రాజశేఖర్‌ ‘రణం`2’ చిత్రంలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మా బావ శ్రీహరికి ఈ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమా హిట్‌ అయితే శ్రీహరిగారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. 

వి.వి.వినాయక్‌: అమ్మ రాజశేఖర్‌ నటిస్తూ డైరెక్ట్‌ చేసిన రణం2 పాటలు చాలా బాగున్నాయి. ఈ ట్రైలర్‌ పరుత్తి వీరన్‌ చిత్రాన్ని గుర్తు చేసింది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. 

గోపీచంద్‌: ఈ ట్రైలర్‌ చూస్తుంటే సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుందనిపిస్తోంది. శ్రీహరిగారి ఆశీస్సులతో సినిమా పెద్ద హిట్టవుతుంది. 

అమ్మరాజశేఖర్‌: రెండు సంవత్సరాలు పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమా చెయ్యడం జరిగింది.  ఈ సినిమాని కల్యాణ్‌గారే ప్రొడ్యూస్‌ చేయాల్సింది. కానీ, కుదరలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. వర్త్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనే పేరు ఈ సినిమాతో వస్తే చాలు అనుకుంటున్నాను. 

ఈ చిత్రానికి  సంగీతం: మణిశర్మ, పాటలు: సుద్ధాల అశోక్‌ తేజ, కెమెరా: శ్రీధర్‌ నార్ల, ఫైట్స్‌: గిల్లిశేఖర్‌, నిర్మాత: శ్రీనివాసయాదవ్‌, కథ-స్క్రీన్‌ప్లే-డ్యాన్స్‌-డైరెక్షన్‌: అమ్మరాజశేఖర్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ