నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎల్.వి.సినిమా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రుద్రపాటి రమణారావు భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు సత్యదేవ ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. త్రిష, రాధికా అప్టే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి1, నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు రాత్రి 11 గంటల 15నిమిషాలకు ఈ చిత్ర టైటిల్ మరియు, టీజర్‌ను విడుదల చేయనున్నారు. అల్రెడి బాలకృష్ణ లుక్‌కి మంచి క్రేజ్ వచ్చిన సందర్భంగా టైటిల్ ఏంటి? బాలకృష్ణ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు టీజర్ ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు, అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి.