శ్రీ భక్త మార్కేండేయ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం అమాయక పాండవులు. ఈ చిత్రానికి టి.రాము దర్శకత్వం వహించారు. విశ్వనాధ్ రెడ్డి, వెన్నెల జంటగా తెరకెక్కిన ఈ చిత్ర గీతావిష్కరణ గురువారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ సందర్బంగా అథితిగా విచ్చేసిన నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ ''ముక్కోటి ఏకాదశి రోజు శివుడి పాటతో ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. నిర్మాత మరియు హీరోగా చేస్తున్న విశ్వనాథ్ రెడ్డి చాలా కష్టపడి, నిజాయితీగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో వచ్చిన సినిమాల కన్నా చిన్న సినిమాలే మంచి విజయాలను అందుకున్నాయి. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందాలని విశ్వనాధ్ ఇంకా చాలా సినిమాలలో నటించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
మరో ముఖ్య అథితి సాయి వెంకట్ మాట్లాడుతూ "సినిమా టైటిల్ చాలా బావుంది. ఈ సినిమాకి రియల్ హీరో సంగీత దర్శకుడు అర్జున్ అనే చెప్పాలి అంత బాగా స్వరాల్ని సమకూర్చారు" అని అన్నారు.
సంగీత దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ''ఈ సినిమాకి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వనాద్ రెడ్డి, రాము కి ధన్యవాదములు తెలుపుతున్నాను" అన్నారు.
దర్శకుడు టి.రాము మాట్లాడుతూ "నా స్క్రిప్ట్ నచ్చి తను బిజీ గా ఉన్నా వెంటనే ఈ సినిమా చేయడానికి విశ్వనాద్ రెడ్డి గారు అంగీకరించారు. పోలీస్ క్యారెక్టర్ లో విశ్వనాద్ బాగా నటించారు. ఈ సినిమా తర్వాత ఆయనకు మంచి పేరు వస్తుంది" అన్నారు.
హీరో మరియు నిర్మాత అయిన విశ్వనాద్ రెడ్డి మాట్లాడుతూ"కథ నచ్చి నేను ఈ సినిమాలో నటించాను. రొటీన్ కథలకు భిన్నంగా ఉంటుంది. తెలంగాణా, రాయలసీమ, శ్రీకాకుళం వంటి ప్రాంతాలలో సినిమా షూటింగ్ చేసాము. మార్చి లేదా ఏప్రిల్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు".
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరూ ఈ సినిమా విజయం సాధించాలని, హీరో-నిర్మాత అయిన విశ్వనాధ్ రెడ్డి కి మంచి పేరు రావాలని అభిలాషించారు.