Advertisementt

ఫిబ్రవరి మొదటి వారంలో ‘టెంపర్‌’

Fri 02nd Jan 2015 07:10 AM
ntr latest movie temper,telugu movie temper,temper movie releasing in february second week,ntr and puri jagannath combo movie temper,temper movie teaser released,temper movie producer bandla ganesh,temper music director anup rubens  ఫిబ్రవరి మొదటి వారంలో ‘టెంపర్‌’
ఫిబ్రవరి మొదటి వారంలో ‘టెంపర్‌’
Advertisement
Ads by CJ

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టెంపర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ టీజర్‌ నూతన సంవత్సర కానుకగా ఈరోజు విడుదలైంది. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్‌తో విడుదల చేసిన ఈ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ..

‘టెంపర్‌’ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

‘‘ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌గార్ల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మా బేనర్‌లో నిర్మిస్తున్న ‘టెంపర్‌’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా ఈరోజు విడుదల చేశాం. ఈ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఎన్టీఆర్‌ లుక్‌గానీ, స్టైల్‌గానీ చాలా కొత్తగా వుందని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చెప్తున్నారు. ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌తో ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి ఎంత పెద్ద రెస్పాన్స్‌ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రిలీజ్‌ చేసిన టీజర్‌కి దాన్ని మించిన రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌ రిలీజ్‌ తర్వాత ఈ సినిమాపై వున్న క్రేజ్‌ రెట్టింపు అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా, ఎంతో పవర్‌ఫుల్‌గా వుంటుంది. ఈ సినిమా బేనర్‌ ప్రతిష్ఠను మరింత పెంచే సినిమా అవుతుంది. అలాగే ఎన్టీఆర్‌గారి కెరీర్‌లో, పూరి జగన్నాథ్‌గారి కెరీర్‌లో, నా కెరీర్‌లో ‘టెంబర్‌’ మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. ఈనెల 20 వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. మరో పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం’’ అన్నారు. 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు. 

ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే`మాటలు`దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ