Advertisementt

ఫ్రెండ్లీ మూవీస్‌ చిత్రం 80 శాతం పూర్తి

Fri 02nd Jan 2015 08:41 AM
chanti addala new movie,naresh son naveen movie details,naveen vijayakrishna movie completed 80 percent,naveen and chanti addala movie director ramprasad raghuthu,heroine keerthi suresh with naveen vijayakrishna  ఫ్రెండ్లీ మూవీస్‌ చిత్రం 80 శాతం పూర్తి
ఫ్రెండ్లీ మూవీస్‌ చిత్రం 80 శాతం పూర్తి
Advertisement
Ads by CJ

నవీన్‌ విజయకృష్ణ హీరోగా ఫ్రెండ్లీ మూవీస్‌ పతాకంపై రామ్‌ప్రసాద్‌ రఘుతు దర్శకత్వంలో చంటి అడ్డాల ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో..

చంటి అడ్డాల:  విజయనిర్మలగారి మనవడు, నరేష్‌గారి తనయుడు నవీన్‌ మా చిత్రంతో హీరోగా, ‘పున్నమినాగు’ హీరోయిన్‌ మేనక కుమార్తె కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ఇప్పటికి 80 శాతం షూటింగ్‌ పూర్తయింది.  ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో మా బేనర్‌లో మరో రెండు సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాం. అందులో ఒక సినిమా టాప్‌ హీరోతో చేయబోతున్నాం. 

నవీన్‌ విజయకృష్ణ, కీర్తి సురేష్‌, చాందిని, రాహుల్‌ దేవ్‌, సప్తగిరి, రచన మౌర్య, నాగబాబు, పోసాని, కొండవలస, రోలర్‌ రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌, సంగీతం: అచ్చు, నిర్మాత: చంటి అడ్డాల, దర్శకత్వం: రామ్‌ప్రసాద్‌ రఘుతు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ