జగదాంబ ప్రొడక్షన్స్ ఫిలింస్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్వకత్వంలో ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న చిత్రం ‘ది బెల్స్’. రాహుల్, నేహ దేశ్‌పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకరోజు మినహా టాకీపార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మోషన్ వాల్ పోస్టర్‌ను ఇటీవల జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా...
దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘ఈ చిత్రం ఒకరోజు మినహా టాకీపార్ట్ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్‌లోని గోల్కొండ ఫోర్ట్ మరియు లక్నవరంలో రెండు పాటలు డాన్స్‌మాస్టర్ బాలకృష్ణ కొరియోగ్రఫీలో చిత్రీకరించడం జరిగింది. మిగిలిన మూడు పాటలను గోవా మరియు తదితర ప్రాంతాల్లో జనవరి 5 నుంచి 16 లోపు పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ చిత్రంలో చక్కని సందేశంతో పాటు ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ఇప్పటి వరకు సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మించాము. ఈ సినిమాకు కెమెరా, మ్యూజిక్ హైలెట్‌గా నిలిచే అంశాలు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న మా యూనిట్ సభ్యుల నడుమ ‘ది బెల్స్’ మోషన్ వాల్‌పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా వుంది. జనవరి చివరివారంలో ఆడియోను విడుదల చేసి సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సర్వసన్నాహాలు చేస్తున్నాము’’ అన్నారు.
రాహుల్, నేహ దేశ్‌పాండే, సూర్య, ఎమ్మెస్ నారాయణ, సప్తగిరి, శివారెడ్డి, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్, సంగీతం: కాసర్లశ్యామ్, పాటలు: వరికుప్పల యాదగిరి, గోరేటి వెంకన్న, కాసర్లశ్యామ్, కూనాడి వాసుదేవరెడ్డి, రచన,మాటలు: శేఖర్ విఖ్యాత్, నిర్మాత: ఎర్రోజు వెంకటాచారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్.