Advertisementt

శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో మెగా హీరో..??

Sun 04th Jan 2015 11:03 PM
allu arjun in shekar kammula directions,allu arjun upcoming films,allu arjun in trivikram project,allu arjun next film,shekar kammula next film with allu arjun  శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో మెగా హీరో..??
శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో మెగా హీరో..??
Advertisement
Ads by CJ

దర్శకుడు శేఖర్‌ కమ్ములది విలక్షణమైన శైలి. యువతను ఆకట్టుకునేలా సినిమాలు తీయడంలో ఆయనది అందవేసిన చెయ్యి. ఇక మరో ప్రత్యేకత ఏమిటంటే శేఖర్‌ కమ్ముల ఎప్పుడూ స్టార్‌ హీరోలతో సినిమాలు తీయడానికి ఇష్టపడరు. కాని ఇప్పుడు తన శైలికి భిన్నంగా వ్యవహరించడానికి శేఖర్‌ కమ్ముల సిద్ధమవుతున్నారు. స్టార్‌ హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల బన్నిని కలిసి శేఖర్‌కమ్ముల స్టోరీ లైన్‌ కూడా వినిపించినట్లు సమాచారం. ఇక స్టోరీ నచ్చడంతో బన్ని కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో సినిమా పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో శేఖర్‌ కమ్ముల బిజీబిజీగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన హిందీలో 'హ్యాపీడేస్‌' సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'హ్యాపీడేస'్‌ను శేఖర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్ని సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ