Advertisementt

సంక్రాంతి కానుకగా 14న శంకర్‌ ‘ఐ’

Tue 06th Jan 2015 01:05 AM
director shankar latest movie i,i movie releasing on 14th jan,vikram new film ai,telugu movie ai,ai music director a.r.rahaman,ai music released,amy jackson in ai  సంక్రాంతి కానుకగా 14న శంకర్‌ ‘ఐ’
సంక్రాంతి కానుకగా 14న శంకర్‌ ‘ఐ’
Advertisement
Ads by CJ

సినిమా ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఐ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్న నిర్మాతలు తెలియజేస్తున్నారు. చియాన్‌ విక్రమ్‌ హీరోగా,  యామి జాక్సన్‌ హీరోయిన్‌గా ఆస్కార్‌ ఫిలిమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై శంకర్‌ దర్శకత్వంలో ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. ఆస్కార్‌ ఫిలిమ్‌ ప్రై. లిమిటెడ్‌, మెగాసూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ప్రై. లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీత సారధ్యంలో రూపొంది ఈ చిత్రంలోని పాటలు సోని మ్యూజిక్‌ ద్వారా ఇటీవల విడుదలై సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ చెయ్యబోతున్నారు. 

సురేష్‌గోపి, ఉపేన్‌ పటేల్‌, సంతానం, రామ్‌కుమార్‌ గణేషన్‌, శ్రీనివాసన్‌, సయ్యద్‌ సిద్ధిక్‌ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌, ఆర్ట్‌: ముత్తురాజ్‌, పాటలు: సుద్దాల అశోక్‌ తేజ, చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌, రామజోగయ్యశాస్త్రి,, కో`ప్రొడ్యూసర్‌: డి.రమేష్‌బాబు, నిర్మాత: ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: శంకర్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ