ఇవివి సినిమా బ్యానర్‌పై అల్లరి నరేష్, ఈషా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బందిపోటు’. దొంగల్ని దోచుకో ట్యాగ్‌లైన్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాజేష్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి కల్యాణి కోడూరి సంగీత సారథ్యం వహిస్తున్నారు. జనవరి 11న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత రాజేష్ ఈదర మాట్లాడుతూ ‘‘నాన్నగారు 2000వ సంవత్సరంలో ఇవివి సినిమా సంస్థను మొదలు పెట్టారు. నాన్నగారి పేరు మీదున్న ఈ బ్యానర్‌లో ప్రెస్టిజియస్ మూవీస్‌ను రూపొందించాలని అనుకున్నాం. మా సంస్థ నుండి సినిమా వస్తుందంటే ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడాలనేదే మా కోరిక. అలాగే మా బ్యానర్ వాల్యూను పెంచే విధంగా మా బ్యానర్‌లో తొమ్మిదో సినిమాగా బందిపోటు విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందించాం. ఇటీవల నూతన సంవత్సర కానుకగా విడుదల చేసిన బందిపోటు చిత్ర ఫస్ట్‌లుక్‌కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కల్యాణ్ కోడూరిగారు అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. జనవరి 11న ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్‌లో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తాం. అలాగే అన్నీ కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసి సినిమాని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు.
తనికెళ్ల భరణి, రావు రమేష్, చంద్రమోహన్, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, సంపూర్ణేష్ బాబు, సప్తగిరి, అవసరాల శ్రీనివాస్, షాయాజీ షిండే తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, అనంత్‌శ్రీరామ్, రాంబాబు గోసాల, ఫైట్స్: నందు, డ్యాన్స్: కల్యాణ్ శేఖర్, రఘు, ఎడిటింగ్: ధర్మేంద్ర, కెమెరా: పి.జి.విందా, సంగీతం: కల్యాణ్ కోడూరి, నిర్మాత: రాజేష్ ఈదర, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.