గోపాల గోపాల ఆడియో వేడుక సందర్భంలో గాయపడిన కరుణ శ్రీనివాస్ అతని కుటుంబ సభ్యులను మంగళవారం (06 - 01 - 15) ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో కలిసి పరామర్శించారు. దాదాపు గంటకు పైగా వారితో సంభాషించారు. శ్రీనివాస్ వైద్యానికి అయిన ఖర్చులనే గాక .. వారి కుటుంబసభ్యులకు యాభై వేల రూపాయలను అందజేసారు పవన్ కళ్యాణ్.