Advertisementt

'ఐ' సంక్రాంతికి వస్తుందా..? రాదా..?

Fri 09th Jan 2015 07:12 AM
i release date,vikram in i,case on i,chennai high court on i,shankars i,oscar ravichandran,shankar upcoming films,vikram upcoming films,i songs in telugu  'ఐ' సంక్రాంతికి వస్తుందా..? రాదా..?
'ఐ' సంక్రాంతికి వస్తుందా..? రాదా..?
Advertisement
Ads by CJ

దక్షిణ భారత దర్శక దిగ్గజం శంకర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన సినిమా 'ఐ'. అయితే ఈ సినిమాకు కొత్తకొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. మొదట దీపావళికే ఈ సినిమాను రిలీజ్‌ చేస్తామని నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ ప్రకటించారు. కాని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఆలస్యం జరగడంతో సినిమా విడుదలను సంక్రాంతికి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ తేదీకి కూడా సినిమా విడుదలవుతుందా..? లేదా..? అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. పిక్చర్‌ మీడియా హౌస్‌ సంస్థ 'ఐ'కి వ్యతిరేకంగా చెన్నై హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ సినిమా కోసం ఆస్కార్‌ తమనుంచి తీసుకున్న రూ. 15 కోట్లను తిరిగి చెల్లించలేదని, వడ్డీ రూ. 2 కోట్లు కలుపుకొని మొత్తం రూ. 17 కోట్లు ఇచ్చే వరకు కూడా సినిమా విడుదలను నిలిపివేయాలని పిటీషన్‌ దాఖలు చేసింది. అయితే కోర్టు ఈ కేసు విచారణను జనవరి 30కి వాయిదా వేసింది. కాగా నేడో రేపో ఆస్కార్‌ ఈ సమస్యను సెటిల్‌చేసే పనిలో తలమునకలైనట్లు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి 'ఐ'ని విడుదల చేస్తామని ఆస్కార్‌ రవిచంద్రన్‌ చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ