Advertisementt

మణిరత్నం కొత్త సినిమా పేరేంటి..??

Fri 09th Jan 2015 01:45 PM
mani rathanm upcoming films,mani rathanm next film ok kanmai,mani rathanm next film ok bangaram,mani rathanm in controversy,mani rathanm next film latest updates  మణిరత్నం కొత్త సినిమా పేరేంటి..??
మణిరత్నం కొత్త సినిమా పేరేంటి..??
Advertisement
Ads by CJ

గత ఐదేళ్లకాలంలో దర్శకుడు 'మణిరత్నం' బ్రాండ్‌వాల్యూ బాగా పడిపోయింది. అంతకుముందు ఆయన సినిమా వస్తుందంటే చాలు నెలల తరబడి ఆ మూవీ కోసం అభిమానులు వేచిచూసేవారు. కాని 'విలన్‌', 'కడలి' సినిమాల ప్లాఫులతో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇక తన గత వైభవాన్ని అందింపుచ్చుకోవడానికి ఇప్పుడు మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఓకే కణ్మణి'. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో మమ్ముట్టి తనయుడు డుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌లు జంటగా నటిస్తున్నారు.  మణిరత్నం సినిమాలకు తెలుగులో కూడా భారీ ఆదరణ ఉండటంతో డబ్బింగ్‌ నుంచి పాటలు, టైటిల్‌ వరకు కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక 'ఓకే కణ్మణి' సినిమాకు తెలుగులో 'ఓకే బంగారం' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ సినిమా 'సఖి' సినిమాకు కొనసాగింపు అనే వార్తలు వినబడుతున్నాయి. కనీసం ఈ చిత్రమైనా మణిరత్నం బ్రాండ్‌వాల్యూను తిరిగి నిలబెడుతుందో లేదో వేచిచూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ