Advertisementt

జనవరి 23న ‘బీరువా’

Tue 13th Jan 2015 07:45 AM
sandeep kishan movie beeruva releasing on 23 jan,   జనవరి 23న ‘బీరువా’
జనవరి 23న ‘బీరువా’
Advertisement
Ads by CJ

ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉషాకిరణ్‌ మూవీస్‌, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన బ్యానర్‌ ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘బీరువా’. యంగ్‌  హీరో సందీప్‌ కిషన్‌, సురభి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 23న విడుదల కాబోతోంది. 

ఈ సందర్భంగా దర్శకుడు కన్మణి మాట్లాడుతూ  ‘‘ఇది ఒక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రానికి థమన్‌ అందించిన సంగీతం చాలా ప్లస్‌ అవుతుంది. ఆల్రెడీ పాటలన్నీ చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. అందర్నీ ఆకట్టుకునే మంచి ఎంటర్‌టైనర్‌ ఇది. జనవరి 23న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.

సంగీత దర్శకుడు థమన్‌ మాట్లాడుతూ  ‘‘బీరువా ఆడియో పెద్ద హిట్‌ అయినందుకు చాలా హ్యపీగా ఉంది. ఇందులో నాలుగు పాటలు వున్నాయి. దేనికవే డిఫరెంట్‌గా వుండే పాటలు కావడంతో ఆడియోకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఆల్బమ్‌లో నాకు పర్సనల్‌్‌గా నాకు నచ్చిన సాంగ్‌ ‘చెలియా చెలియా..రలియా రలియా’. ఈ చిత్రంలోని పాటలు ఆడియో పరంగానే కాకుండా విజువల్‌గా కూడా చాలా బాగా వచ్చాయి. ఆడియన్స్‌ పాటల్ని, సినిమాని డెఫినెట్‌గా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు. 

నరేష్‌, ముఖేష్‌ రుషి, చలపతిరావు, అజయ్‌, సప్తగిరి, వేణు, షకలక శంకర్‌, గుండు సుదర్శన్‌, శివన్నారాయణ, అనితా చౌదరి, అనీషా సింగ్‌, సంధ్య తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి డ్యాన్స్‌: రాజు సుందరం, బాబా భాస్కర్‌, శేఖర్‌, ఫైట్స్‌: వెంకట్‌, పాటలు: శ్రీమణి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్‌, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, లైన్‌ ప్రొడ్యూసర్‌: సుబ్రత్‌ రాయ్‌, నిర్మాత: రామోజీరావు, కథ,దర్శకత్వం: కణ్మణి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ