Advertisementt

26న 'సూర్య వర్సెస్ సూర్య' గీతాలు

Tue 13th Jan 2015 07:48 AM
nikhil new movie surya vs surya audio on 26th jan  26న 'సూర్య వర్సెస్ సూర్య' గీతాలు
26న 'సూర్య వర్సెస్ సూర్య' గీతాలు
Advertisement
Ads by CJ

‘అందమైన సూర్యోదయాలు మనసును ఉల్లాసపరుస్తాయి. అలాగే మలిసంధ్య వేళ ఎర్రటికాంతుల్ని వెదజల్లుతూ పడమటి ఒడిలోని జారుకునే భానుడు  ప్రతి ఒక్కరికి మనోహర దృశ్యంగా గోచరిస్తాడు. అయితే సూర్య అనే పేరున్న యువకుడు మాత్రం సూర్యతేజస్సును ఏ మాత్రం తట్టుకోలేడు. పగటిపూట బయట అడుగుపెట్టాలంటే నిలువెల్లా వణికిపోతాడు. నిషాచరిలా రాత్రిళ్లు సంచరిస్తుంటాడు.  ఇంతకి సూర్యుడితో అతనికున్న వున్న సంబంధమేమిటి? ఆ యువకుడు ఓ అమ్మాయి ప్రేమలో పడితే అతడి జీవిత ప్రయాణం ఎలా సాగింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మా చిత్రం చూడాల్సిందే’ అన్నారు కార్తిక్ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో నిఖిల్, త్రిధ జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్య వర్సెస్ సూర్య’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. రథసప్తమి సందర్భంగా ఈ నెల 26న చిత్ర గీతాల్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా  దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సూర్యుడి కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే యువకుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడన్నదే చిత్ర ఇతివృత్తం. కమర్షియల్ అంశాలు మేళవించి ప్రయోగాత్మకంగా తెరకెక్కించాం. తెలుగుప్రేక్షకులకు  సరికొత్త అనుభూతినిస్తుంది’ అన్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. తనికెళ్ల భరణి, మధుబాల, రావు రమేష్, షాయాజీషిండే, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్య, సలీమ్‌ఫేక్, అల్లరి సుభాషిణి, వివా హర్ష, జెన్నీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, మాటలు: చందు మొండేటి, ఎడిటింగ్: గౌతమ్ నెరసు, ఆర్ట్: టి.ఎన్‌పసాద్, కొరియోగ్రఫీ: విజయ్, ఫైట్స్: వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, కృష్ణ చిన్ని

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ