దాదాపు 16 ఏళ్లుగా కృష్ణ జింకలు సల్మాన్‌ఖాన్‌ను వదలడం లేదు. రాజస్తాన్‌లో కృష్ణ జింకలను వేటాడాడని సల్మాన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొన్నేళ్ల క్రితం తీర్పునిచ్చిన కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. దీనిపై సల్మాన్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ తీర్పుపై హైకోర్టు స్టే ఇవ్వడమే కాకుండా సల్మాన్‌కు బెయిల్‌తోపాటు విదేశాలకు వెళ్లడానికి కూడా అనుమతించింది. దీనిపై రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ సల్మాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. సల్మాన్ బెయిల్ కేసును తిరిగి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా సల్మాన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో సల్మాన్‌ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఇక సల్మాన్ విదేశాలకు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. అంతేకాకుండా ఒకవేళ హైకోర్టు బెయిల్ కూడా రద్దు చేస్తే సల్మాన్ జైలు బాట పట్టాల్సి ఉంటుంది. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.