Advertisementt

ఇక ధనుష్‌ కూడా వారిబాటలోనే..!!

Fri 16th Jan 2015 06:11 AM
dhanush upcoming films,dhanush in raghuvaran btech,dhanush in anekudu,anekudu release date,dhanush wife,dhanush telugu movies  ఇక ధనుష్‌ కూడా వారిబాటలోనే..!!
ఇక ధనుష్‌ కూడా వారిబాటలోనే..!!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీపై తమిళనటులకు రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. తమిళంలోని ప్రధాన హీరోలంతా టాలీవుడ్‌పై దృష్టి పెట్టినప్పటికీ విజయ్‌, ధనుష్‌లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇక 'త్రీ' సినిమాతో ధనుష్‌, 'తుపాకీ'తో విజయ్‌లు తెలుగునాట తమకంటూ ఓ మార్కెట్‌ సృష్టించుకున్నారు. తాజాగా ధనుష్‌ డబ్బింగ్‌చిత్రం 'రఘువరన్‌ బీటెక్‌' టాలీవుడ్‌లో రిలీజై ప్రేక్షకాధరణ పొందింది. దీంతో తన రాబోయే చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయడానికి ధనుష్‌ సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న 'అనేగన్‌' చిత్రాన్ని తెలుగులో 'అనేకుడు' పేరుతో రిలీజ్‌ చేయనున్నారు. ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషాల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. కాస్త ఆలస్యమైనప్పటికీ ధనుష్‌ కూడా మెల్లిగా టాలీవుడ్‌లో మార్కెట్‌ సంపాదించడంపై దృష్టిపెట్టినట్లు కనబడుతోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ