వరుస హిట్లతో స్టార్‌హోదా దక్కించుకున్న హీరో నితిన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అందునా అమ్మాయిలు నితిన్ అంటే పడి చచ్చిపోతున్నారు. అది ఎంతగా అంటే.. ఏకంగా ఆయన ఇంట్లోకి చొరబడి నితిన్‌ను తాను ప్రేమిస్తున్నానని చెప్పేటంతగా. పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి 10 గంటలకు ఓ యువతి హీరో నితిన్ ఇంట్లోకి చొరబడింది. దొంగతనంగా ఇంట్లోకి ప్రవేశించిన ఆ అమ్మాయిని నితిన్ తల్లి గమనించి ప్రశ్నిస్తే.. తాను నితిన్ అభిమానినని, ఆయన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. తీరా ఆమె గురించి ఆరా తీస్తే.. ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తె అని తెలిసింది. ఇక పోలీసులు నితిన్ ఇంటికి వచ్చి ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి ఆమె ఇంటివద్ద వదిలిపెట్టారు. మరి ఇంతగా నితిన్‌పై అభిమానం పెంచుకున్న అమ్మాయిలు ఇంకా ఎంతమంది ఉన్నారో..?