Advertisementt

హాలీవుడ్‌లోకి కోలీవుడ్‌ హీరో..!!

Mon 19th Jan 2015 05:06 AM
vijay upcoming films,vijay hollywood entry,vijay in puli,vijay films list,kollywood no.1 hero vijay,vijay vs surya,vijay vs vikram  హాలీవుడ్‌లోకి కోలీవుడ్‌ హీరో..!!
హాలీవుడ్‌లోకి కోలీవుడ్‌ హీరో..!!
Advertisement
Ads by CJ

తమిళ కథానాయకుడు విజయ్‌ హాలీవుడ్‌లో అరంగేట్రం చేయనున్నారా..? అంటే నిజమేనంటునానయి కోలీవుడ్‌ వర్గాలు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తమిళంలో అప్సర కుమార్‌ రూపొందిస్తున్న చిత్రం 'ఒన్నుమే పురియాలా'. జాక్‌ మైఖేల్‌, హరిణి, విద్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా పునర్నిర్మాణ హక్కుల్ని యూరోపియన్‌ అగ్ర నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. కథానుగుణంగా భారతీయ అగ్ర కథానాయకుడితో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించిన వారు ఇందుకోసం విజయ్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ఆంగ్లంతోపాటు జర్మన్‌ భాషలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్‌ 'పులి' చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ