Advertisementt

అల్లు అర్జున్‌ చిత్రం పేరు జాదుగర్‌..??

Mon 19th Jan 2015 05:17 AM
allu arjun new film,allu arjun upcoming films,allu arjun as jadugar,allu arjun,trivikram film,trivikram upcoming films  అల్లు అర్జున్‌ చిత్రం పేరు జాదుగర్‌..??
అల్లు అర్జున్‌ చిత్రం పేరు జాదుగర్‌..??
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్‌ పూర్తి కావొచ్చిన ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. అయితే ఈ సినిమాకు 'జాదుగర్‌' అనే టైటిల్‌ను సినిమా యూనిట్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమాలో అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌కు ఈ టైటిల్‌ సరిగ్గా పరిపోతుందని భావిస్తున్న దర్శకుడు దాదాపు 'జాదుగర్‌'ను ఫైనలైజ్‌ చేసినట్లు తెలిసింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, సమంతా, ఆదాశర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నాడు. 'జులాయి' తర్వాత అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ