Advertisementt

వెంకటేష్ సినిమాకు నో - శృతి హాసన్..!

Tue 20th Jan 2015 07:25 AM
shruthihassan rejected venkatesh movie,shruthi hassan news,shruthihassan,  వెంకటేష్ సినిమాకు నో - శృతి హాసన్..!
వెంకటేష్ సినిమాకు నో - శృతి హాసన్..!
Advertisement
Ads by CJ
సీనియర్ హీరోల పేరు వినిపిస్తే యంగ్ హీరోయిన్‌లు మొహం చాటేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. దశరథ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సన్నాహాలు చేస్తుంది. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్‌ను సంప్రదించినట్టు గత రెండు రోజులుగా మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్త ఆ నోటా, ఈ నోటా శృతి చెవిన పడింది. వెంటనే, ట్విట్టర్‌లో "నేను ఏదైనా కొత్త సినిమాలో భాగమైతే మీ అందరికీ చెప్తాను. అంతే గాని, ఎటువంటి పుకార్లు ప్రచారం చేయవద్దు. నాకు ప్రతి ఒక్కరిపై గౌరవం ఉంది"అంటూ ఓ ట్వీట్ చేసింది. వెంకటేష్ ప్రస్తావన తీసుకు రాకుండానే, నేను ఆ మూవీలో నటించడం లేదని తేల్చి చెప్పింది. 
ఈ విషయంలో హీరోయిన్‌లది తప్పుని చెప్పలేం. సీనియర్ హీరోల పక్కన నటిస్తే యంగ్ హీరోలు ఛాన్స్ ఇవ్వరు. అసలే వాళ్ళ ఇమేజ్ కొంత కాలమే ఉంటుంది. ఈ టైంలోనే నాలుగు రాళ్ళు వెనకేసుకున్నా, కొంచం కెరీర్ సాగించినా. ఎవరి ప్లానింగ్ వాళ్ళది.       
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ