Advertisementt

ఫిబ్రవరి 13న ఎన్టీఆర్ దండయాత్ర

Tue 20th Jan 2015 07:28 AM
ntr temper on 13 february,nrt temper news,temper film news,ntr,kajal in temper  ఫిబ్రవరి 13న ఎన్టీఆర్ దండయాత్ర
ఫిబ్రవరి 13న ఎన్టీఆర్ దండయాత్ర
Advertisement
Ads by CJ
"ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడి పోతే... దండయాత్ర.. ఇది దయగాడి దండయాత్ర'' అంటూ 'టెంపర్' టీజర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ దద్దరిల్లిపోయింది. ఈ దండయాత్రను చూడడానికి ప్రేక్షకులు ఫిబ్రవరి 13 వరకు వెయిట్ చేయాలి. థియేటర్‌లలో ఫిబ్రవరి 13న ఎన్టీఆర్ దండయాత్ర షురూ చేస్తాడని సమాచారం. ఫిబ్రవరి 5న మూవీని విడుదల చేయాలని భావించినా, చివరకు ఫిబ్రవరి 13 బెటర్ అని డిసైడ్ అయ్యారు. ప్రజెంట్ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.     
 
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఎన్టీఆర్, 'టెంపర్' తో ఆ ముచ్చట తీర్చేస్తాడని నందమూరి అభిమానులు ఫిక్స్ అయిపోయారు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ