విక్రమ్‌శేఖర్, ప్రభ్‌జీత్ కౌర్ జంటగా బాలాజీ దర్శకత్వంలో శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, శరద్‌మిశ్రా, శ్రీనివాసులు దంపూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఇంటెలిజెంట్ ఇడియట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో విక్రమ్‌శేఖర్, ప్రభ్‌జీత్ కౌర్, నిర్మాతలు, దర్శకుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ: నేను చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించిన నిర్మాతలకు థాంక్స్ చెప్తున్నాను. నేను ఏదైతే చెప్పానో దాన్ని అందంగా తెరపై చూపించేందుకు ప్రయత్నించాను. ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది.
చిత్ర నిర్మాతలు: ప్రస్తుతం యూత్ ఎలా వుంది, వారి ఆలోచనలు ఏవిధంగా వుంటున్నాయి. యూత్ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనే విషయాలు ఈ సినిమాలో డిస్కస్ చేయడం జరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా బాలాజీగారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నెల 23న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం నాకు వుంది.
విక్రమ్ శేఖర్: కొత్తదనాన్ని కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈనెల 23న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం మీ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం.
ప్రభ్‌జీత్ కౌర్: ఇది నాకు చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇది ప్రతి ఒక్కరికీ నచ్చే కాన్సెప్ట్. స్టార్టింగ్ టు ఎండిరగ్ సినిమా అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే వుంటుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా థాంక్స్.