Advertisementt

ఫిబ్రవరి మొదటి వారంలో ‘పిశాచి’

Tue 20th Jan 2015 07:38 AM
c.kalyan new movie pishachi releasing in feb 2nd week  ఫిబ్రవరి మొదటి వారంలో ‘పిశాచి’
ఫిబ్రవరి మొదటి వారంలో ‘పిశాచి’
Advertisement
Ads by CJ

‘చంద్రకళ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన సి.కళ్యాణ్‌ తాజాగా తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ‘పిశాచి’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అందిస్తున్న విషయం తెలిసిందే. మిస్కిన్‌ దర్శకత్వంలో ప్రముఖ తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాచి’ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌, కల్పన చిత్ర కాంబినేషన్‌లో సి.కళ్యాణ్‌, కల్పన తెలుగులో విడుదల చేస్తున్నారు. 

ఈ చిత్రం గురించి నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ` ‘‘మిస్కిన్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘పిశాచి’ చిత్రం ఇటీవల విడుదలై అక్కడ చాలా పెద్ద హిట్‌ అయింది. మనసుల్ని దోచుకునే దెయ్యం కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేస్తుంది. రొమాంటిక్‌ హార్రర్‌గా రూపొందిన ‘పిశాచి’ తెలుగులోనూ పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. ఇటీవల మా బేనర్‌లో విడుదల చేసిన ‘చంద్రకళ’ సూపర్‌హిట్‌ అయింది. దాన్ని మించి ‘పిశాచి’ ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము’’ అన్నారు.

బాల సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌, కల్పన చిత్ర బేనర్స్‌లో విడుదల కానున్న ‘పిశాచి’ చిత్రంలో నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, హరీష్‌ ఉత్తమన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి రాయ్‌, సంగీతం: ఎ.కె., మాటలు: శశాంక్‌, ఎడిటింగ్‌: గోపీనాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కో`ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, నిర్మాతలు: సి.కళ్యాణ్‌, కోనేరు కల్పన, దర్శకత్వం: మిస్కిన్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ