తమిళ్ లో ఘన విజయం సాధించిన 'అడుకాళం' చిత్రాన్ని సన్ పిక్చర్స్, సమూహ టాకీస్ వారు సంయుక్తంగా తెలుగు లో 'పందెంకోళ్ళు' పేరుతో అందిస్తున్నారు. ధనుష్, తాప్సీ కథానాయకులు. వెట్రిమారన్ దర్శకుడు. ఎ.శేఖర్ బాబు, ఎం.కిషోర్ కుమార్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.
ఆడియో లాంచ్ కి అథిదిగా వచ్చిన కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో విడుదలయిన డబ్బింగ్ చిత్రాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది. విశాల్ నటించిన 'పందెం కోడి' సినిమాల ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని'' అన్నారు.
నిర్మాతల మండలి అధ్యక్షుడు, సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ "తమిళం లో చాలా రియలిస్టిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు. అదే సినిమాని తెలుగు లో అనువదించడం చాలా ఆనందంగా ఉంది. పాటలు కూడా చాలా బావున్నాయి. ఒక పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బింగ్ సినిమాలలో ఒక మంచి సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది" అని అన్నారు.
ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి మాట్లాడుతూ "ధనుష్ కి రఘువరన్ బి.టెక్ ఎలా ప్లస్ పాయింట్ గా నిలిచిందో ఈ చిత్రం కూడా అంత పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు. ఈ సినిమా కి మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి, పాటలు:వనమాలి, సంగీతం: జి.వి.ప్రకాష్, నిర్మాణం: నెల్లూరు నాగరాజు, కెమెరా: వేల్ రాజ్.