ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఇండియా కవర్ పేజిపై వచ్చిన యాడ్ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జుహి చావ్లాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 'కెమరామెన్ గంగతో రాంబాబు' ఐటెం గర్ల్ స్కార్లెట్ విల్సన్ షవర్ కింద బికినీ వేసుకుని స్నానం చేస్తున్న ఫోటోను మంగళవారం కవర్ పేజిపై ప్రచురించారు.
"లీడింగ్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో ఇలాంటి ఫోటో ఏమిటి..?? మనం ఎక్కడికి వెళ్తున్నాం... ఎక్కడ చూసినా డబ్బేనా..?" అంటూ జుహి చావ్లా ట్వీట్ చేసింది. అంతటితో ఆగలేదు, "మార్పు మనతోనే మొదలు కావాలని మహాత్మా గాంధీ చెప్పారు. అందుకే, టైమ్స్ అఫ్ ఇండియా సబ్ స్క్రిప్ షన్ కాన్సిల్ చేస్తున్నాను." అని పేర్కొంది.

ఈ విమర్శలను స్కార్లెట్ విల్సన్ లైట్ తీసుకుంది. ఎవరో నా యాడ్ పట్ల సంతోషం లేరు అంటూ ట్విట్టర్‌లో స్పందించింది. జుహీ చావ్లా ట్వీట్‌ను రీ-ట్వీట్ చేయడంతో పాటు అభిమానులు నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ ఇచ్చిన కాంప్లిమెంట్స్ కూడా రీ ట్వీట్ చేసింది.