Advertisementt

ఈ నెల 30న వస్తున్న ఆనందిని..!

Mon 26th Jan 2015 01:06 PM
anandini,archana,horror thriller,nirnay pallati  ఈ నెల 30న వస్తున్న ఆనందిని..!
ఈ నెల 30న వస్తున్న ఆనందిని..!
Advertisement
Ads by CJ

పార్వతి పరమేశ్వర పిక్చర్స్ బేబీ హరిష్యా - మాస్టర్ హర్షిత్ సమర్పిస్తున్న చిత్రం 'ఆనందిని'. ఈ చిత్రం షూటింగ్ ముగించుకొని ఈ నెల 30 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు నిర్ణయ్ పల్లాటి మాట్లాడుతూ"ఈ సినిమా కథ సిద్ధం చేసుకొని నిర్మాతను కలిసాను. స్క్రిప్ట్ నచ్చి నాతో ఈ చిత్రం చేయడానికి ఆయన అంగీకరించారు. సమాజంలో ఆడవాళ్ళకి ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చంద్రబోసు రాసిన పాట ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది" అని చెప్పారు.
నిర్మాత తన్నీరు రాంబాబు మాట్లాడుతూ"ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన అమ్మాయి ఎలాంటి అణచివేతకు గురవుతుందో అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తీసాం. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. ఆడియో మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. 
ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన నటి అర్చన మాట్లాడుతూ"ఈ సినిమాలో నా పాత్ర పేరు ఆనందిని. ఇది ఒక హారర్ థ్రిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. ఈ మధ్య హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నాను. ఈ సినిమా లో ఆనందిని పాత్రలో నటిస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. అంతగా నాకు ఈ చిత్రం నచ్చింది. ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది" అని చెప్పారు.

హీరోగా నటించిన శశికుమార్ రాజేంద్రన్ మాట్లాడుతూ"ఈ చిత్రం లో ఒక జెన్యూన్ లవర్ బాయ్ పాత్ర నాది. యంగ్ స్టర్స్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది" అని చెప్పారు.

ఈ చిత్రంలో నటీనటులు: అర్చన, శశికుమార్ రాజేంద్రన్, లిజా, షాని, భార్గవి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యానంద్, ఎడిటర్: బి.మహేంద్రనాథ్, సంగీతం: బండి సత్యం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ