హెజెస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బూచమ్మ బూచోడుతో ఫస్ట్ అటెంప్ట్ లోనే హిట్ కొట్టిన ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "లవ్ స్టేట్స్". ప్రముఖ మోడల్ ఉపేన్ ని హీరోగా పరిచయం చేస్తున్న ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం పోస్టర్ లాంచ్ ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ"ఈ సినిమా ఒక క్రైమ్ లవ్ స్టొరీ. ఈ సినిమాలో డైలాగ్స్, మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని నిర్మించాం. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో 10 రోజులలో పూర్తి చేసి ఫిబ్రవరి 20 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలియజేసారు.
దర్శకుడు శ్రవణ్ కుమార్ నల్లా మాట్లాడుతూ"నా స్క్రిప్ట్ నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అంతే నమ్మకంతో నేను కూడా ఈ సినిమా బాగా తీయడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూనే ఉంటారు" అని చెప్పారు.
హీరోగా నటించిన మోడల్ ఉపేన్ మాట్లాడుతూ"ఇది ట్రై యాంగల్ లవ్ స్టొరీ. క్రైమ్ కూడా మిక్స్ చేసి ఈ సినిమా తీసారు. డైరెక్టర్ శ్రవణ్ చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పవన్ స్వరాల్ని సమకూర్చారు. ఇది ఒక మ్యూజికల్ హిట్ గా కూడా నిలుస్తుంది"అని చెప్పారు.
ఈ చిత్రంలో నటీనటులు: అంబికా సోనీ, తాన్యా శర్మ, ఎమ్మెస్ నారాయణ, చలాకి చంటి, సుభాషిణి, పూజిత, సంధ్య.
ఈ చిత్రానికి ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్, కెమెరా: గౌతం, శరత్, ఎడిటింగ్: ఉదయ్ కుంభం,