రాష్ట్ర విభజన తర్వాత సినీ ఇండస్ట్రీ ఎటువైపు సెటిలవుతుందోనన్న అంశంపై పెద్దమొత్తంలో చర్చలు సాగాయి. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉండి ఏపీలో రాజధాని ఏర్పడిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించాయి. అయితే వైజాగ్‌లో కూడా ఇండస్ట్రీని డెవలప్ చేయాలని కొందరు సినీ పెద్దలు నిర్ణయించుకున్నారు. కాని వారి నిర్ణయంలో ఇప్పుడు 'హుదూద్' తుఫాన్ మార్పు తీసుకొచ్చినట్లు కనబడుతోంది. ఇదే విషయమై సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ.. హుదూద్ తర్వాత సినీ ఇండస్ట్రీకి వైజాగ్ అంత సేఫ్ కాదనే నిర్ణయానికి ఇండస్ట్రీ పెద్దలు వచ్చారని, దీనికి ప్రత్యామ్నాయంగా గుంటూరులో ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. కళమ్మ తల్లికి అనేక మంది అద్భుతమైన నటులను అందించిన గుంటూరు ఇక ఇండస్ట్రీ పరంగా కూడా అభివృద్ధి చెందనుందని ఆలీ చెప్పారు. మరి ఆలీ చెప్పిన మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే..!