Advertisementt

రెడీ ఫర్‌ రిలీజ్‌ ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’

Thu 29th Jan 2015 05:01 AM
ladies and gentlemen movie,ladies and gentlemen on 30th jan  రెడీ ఫర్‌ రిలీజ్‌ ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’
రెడీ ఫర్‌ రిలీజ్‌ ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, ఎం.వి.కె.రెడ్డి నిర్మాతలుగా షిర్డీ సాయి కంబైన్స్‌ పతాకంపై బి.మంజునాథ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’. చైతన్యకృష్ణ, మహత్‌ రాఘవేంద్ర, అడవి శేష్‌, కమల్‌ కామరాజ్‌, స్వాతి దీక్షిత్‌, నిఖితా నారాయణ్‌, జాస్మిన్‌ భాసిన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, దర్శకుడు పి.బి.మంజునాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 

మధుర శ్రీధర్‌రెడ్డి: ఇది సైబర్‌ క్రైమ్‌ మీద వస్తున్న తొలి తెలుగు సినిమా. ఇంటర్నెట్‌ అనేది మనుషుల్ని ఎలా ఆక్రమించేసింది అని చెప్పే ప్రయత్నం చేశాం. భార్యాభర్తలు కలిసి వుంటున్నా దూరంగా బ్రతికే స్థితికి వారిని ఇంటర్నెట్‌ తీసుకొచ్చింది. ఇంటర్నెంట్‌ అందర్నీ ఇన్‌ఫ్లుయెన్స్‌ చేస్తోంది. యదార్థంగా జరిగిన మూడు సంఘటనలను తీసుకొని ఈ సినిమా చెయ్యడం జరిగింది. ఒక స్టూడెంట్‌, ఒక ఎంప్లాయ్‌, ఒక మారీడ్‌ కపుల్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలుగా వుంటాయి. ఇది ఒకరకంగా ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌. కాన్సెప్ట్‌ నచ్చి పూరి జగన్నాథ్‌గారు ఈ సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అలాగే మహేష్‌భట్‌గారు సినిమా మొత్తం చూడడం జరిగింది. ఆయనకు కాన్సెప్ట్‌ బాగా నచ్చి మమ్మల్ని అప్రిషియేట్‌ చేశారు. మా బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌ చిత్రానికి వర్క్‌ చేసిన మంజునాథ్‌ని ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము. ఈ సినిమా కోసం అతను చాలా హార్డ్‌ వర్క్‌ చేశాడు. సినిమా మీద మేం చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. కథల విషయంలో ఒక కొత్త ఒరవడి ఈ సినిమాతో వస్తుందని భావిస్తున్నాం. 

పి.బి.మంజునాథ్‌: ఈ సినిమా ద్వారా నేను దర్శకుడుగా పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది. ముఖ్యంగా శ్రీధర్‌గారి బేనర్‌లో చేయడం ఇంకా హ్యాపీగా వుంది. నేను పనిచేసిన సంస్థ కాబట్టి ఎలాంటి ఇబ్బందీ లేకుండా వర్క్‌ చెయ్యగలిగాను. మా ఫ్రెండ్‌ సంజీవ్‌రెడ్డి చెప్పిన కథ ఇది. దాన్ని అందరికీ రీచ్‌ అయ్యే విధంగా రూపొందించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఆలోచింపజేస్తుందన్న నమ్మకం నాకు వుంది. రియల్‌ ఇన్సిడెంట్స్‌తో తయారు చేసిన ఈ కథ తప్పకుండా అందరికీ కనెక్ట్‌ అవుతుంది. రేపు రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. 

ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, పాటలు: సిరాశ్రీ, మాటలు: నివాస్‌, కథ: సంజీవ్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ: జగన్‌ చావలి, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఖాన్‌, నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, ఎం.వి.కె.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.బి.మంజునాథ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ