Advertisementt

కుస్తీలు పడుతున్న జాక్వలైన్‌

Fri 30th Jan 2015 04:03 AM
jacqueline fernandez,bollywood actress,jacqueline fernandez duel role,roy movie  కుస్తీలు పడుతున్న జాక్వలైన్‌
కుస్తీలు పడుతున్న జాక్వలైన్‌
Advertisement
Ads by CJ

సినిమాలో నా పాత్ర పండడం కోసం ఎంతగా కష్టపడుతున్నానో అంతకుమించి హిందీ భాష నేర్చుకోవడానికి ఎక్కువగా కష్టపడుతున్నాను అని చెబుతోంది శ్రీలంక బ్యూటి జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌. 2009లో ‘అల్లాడిన్‌’ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ 2014 వరకు దాదాపు 8 సినిమాల్లో యాక్ట్‌ చేసింది. అయినాగానీ హిందీ భాష మీద అంత పట్టు సంపాదించలేదు. ప్రస్తుతం హిందీని ఇంప్రూవ్‌ చేసుకొనేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోందీ బ్యూటి. జాక్వలైన్‌ మాట్లాడుతూ... 2009 నుండి హిందీ నేర్చుకుంటున్నాను. భాష నేర్చుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇక్కడి కల్చర్‌ ఏంటో తెలుస్తుంది. భాష తెలియడం వల్ల షూటింగ్‌ టైమ్‌లో స్పాంటేనియస్‌ ఉండొచ్చని తెలుసుకున్నాను. అందుకే వీలైనంత తొందరగా హిందీ నేర్చుకునేందుకు కుస్తీలు పడుతున్నాను. ఇప్పటికి కొంతవరకు లాంగ్వేజ్‌ తెలుసు. అందరితో కమ్యునికేట్‌ చేయగలుగుతున్నాను. నా హిందీ టీచర్‌ దగ్గర మాట్లాడడంతో పాటు హిందీ పాటలు కూడా నేర్చుకుంటున్నాను. డైలాగ్‌ డిక్షన్‌ కూడా ఇప్పుడిప్పుడు తెలుస్తోంది అని తెలిపింది. 

జాక్వలైన్‌ ఈ ఏడాది నాలుగు సినిమలకు సైన్‌ చేసింది. ప్రస్తుతం ‘రాయ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇందులో డబుల్‌ రోల్‌లో జాక్వలైన్‌ కనిపించనుంది. డ్యూయల్‌ రోల్‌ చెయ్యడం ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అనీ, కాస్త కష్టంగా ఉన్నా... రెండు పాత్రలు నచ్చడంతో కష్టం తెలియట్లేదని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ