Advertisementt

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ‘క్రిమినల్స్‌’

Mon 02nd Feb 2015 08:04 AM
nisha kothari,criminals movie,osho tulasiram  పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ‘క్రిమినల్స్‌’
పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ‘క్రిమినల్స్‌’
Advertisement
Ads by CJ

‘మంత్ర’, ‘మంగళ’ వంటి విభిన్న చిత్రాలను రూపొందించి దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న ఓషో తులసీరామ్‌ తాజాగా ‘క్రిమినల్స్‌’ పేరుతో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. నిషా కొఠారి, అఖిల్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పి.ఎస్‌.ఆర్‌. ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకాలపై పి.శ్రీనివాసరావు, సి.హెచ్‌.వి.శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు పి.శ్రీనివాసరావు, సి.హెచ్‌.వి.శర్మ మాట్లాడుతూ ‘‘మేం అనుకున్న షెడ్యూల్స్‌లో మా చిత్రాన్ని పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా రీ`రికార్డింగ్‌, సి.జి. వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి నెలాఖరులో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. నిషా కొఠారి పెర్‌ఫార్మెన్స్‌ ఈ సినిమాకి హైలైట్‌ అవుతుంది. కమర్షియల్‌ హిట్‌ సినిమాకి కావల్సిన యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రంలో వున్నాయి. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకు వుంది’’ అన్నారు.

దర్శకుడు ఓషో తులసీరామ్‌ మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ ప్రధానంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ వికారాబాద్‌ అడవుల్లో జరిగింది. అలాగే రంపచోడవరంలో కూడా సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. మంత్ర ఆనంద్‌ ఇచ్చిన మ్యూజిక్‌ ఈ సినిమాకి చాలా ప్లస్‌ అవుతుంది. ప్రస్తుతం రీ`రికార్డింగ్‌ జరుగుతోంది. ఆనంద్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇస్తున్నారు’’ అన్నారు.

నిషా కొఠారి అఖిల్‌ కార్తీక్‌, రవిబాబు, విజయ్‌సాయి, ఉత్తేజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మంత్ర ఆనంద్‌, సినిమాటోగ్రఫీ: జస్వంత్‌, మాటలు: రాజా, కో`ప్రొడ్యూసర్స్‌: కె.వి.సుబ్బారావు, కె.నాగశేఖర్‌, నిర్మాతలు: పి.శ్రీనివాసరావు, సి.హెచ్‌.వి.శర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓషో తులసీరామ్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ