2015 సంవత్సరంలో తెలుగు చిత్రపరిశ్రమకు శుభారంభాన్నిచ్చిన చిన్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’. ప్రముఖ దర్శకులు మధుర శ్రీధర్‌రెడ్డి తన శిష్యుడు పి.బి.మంజునాధ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ఈ చిత్రం అందరి అభిమానాన్ని చూరగొంటూ ఘన విజయం సాధించే దిశగా దూసుకెళుతోంది.
ఈ చిత్రం కన్నడ రీమేక్ రైట్స్‌ను అక్కడి అగ్ర నిర్మాతల్లో ఒకరైన బి.కె.గంగాధర్ ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకొన్నారు. మధుర శ్రీధర్‌రెడ్డి మునుపటి చిత్రం ‘మాయ’ చిత్రం రీమేక్ రైట్స్‌ను కూడా ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేష్‌భట్ దక్కించుకొని అక్కడ ‘మర్డర్`4’గా రీమేక్ చేస్తుండడం విశేషం. కాగా.. ‘లెడీస్ అండ్ జెంటిల్‌మెన్’ తమిళ రీమేక్ రైట్స్ కోసం పలువురు ప్రముఖ తమిళ నిర్మాతలు పోటీపడుతున్నారు.
ఈ సందర్భంగా మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘నేను తెలుగులో నిర్మిస్నున్న చిత్రాలు ఇతర చిత్ర పరిశ్రమను ఆకర్షిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మొన్న ‘మాయ’, నేడు ‘లెడీస్ అండ్ జెంటిల్‌మెన్’ రీమేక్ రైట్స్ కోసం హిందీ మరియు కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి ఎంక్వైరీస్ వస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహంతో నా తదుపరి చిత్రాలను రూపొందిస్తాను. మా చిత్రానికి ఇంతటి మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను’ అన్నారు!