Advertisementt

ఛార్మి ‘జ్యోతిలక్ష్మీ’గా పూరి, సి.కళ్యాణ్‌ చిత్రం

Thu 05th Feb 2015 01:26 AM
telugu movie jyothi lakshmi,charmi as jyothi lakshmi,puri jagannath,c.kalyan  ఛార్మి ‘జ్యోతిలక్ష్మీ’గా పూరి, సి.కళ్యాణ్‌ చిత్రం
ఛార్మి ‘జ్యోతిలక్ష్మీ’గా పూరి, సి.కళ్యాణ్‌ చిత్రం
Advertisement
Ads by CJ

ఛార్మి ప్రధాన పాత్రలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ’ పేరుతో ఓ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 20 స్టార్ట్‌ అవుతోంది. ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను ఛార్మి పోషిస్తోంది. ఈ వివరాలను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ‘పిశాచి’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నిర్మాత సి.కళ్యాణ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెలిపారు. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లోనే వరుణ్‌తేజ్‌ హీరోగా మరో చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్టు నిర్మాత సి.కళ్యాణ్‌ చెప్పారు. 

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ