Advertisementt

'దృశ్యం'లో టబూ..!!

Fri 06th Feb 2015 04:37 AM
drishyam in hindi,tabu,ajaydevagan,police officer  'దృశ్యం'లో టబూ..!!
'దృశ్యం'లో టబూ..!!
Advertisement
Ads by CJ

మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన 'దృశ్యం' సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో పునిర్నిమాణమైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక అటుపై ఇప్పుడు తమిళంలో కూడా ఈ సినిమా తిరిగి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌కు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మలయాళంలో ఆశా శరత్‌ పోషించిన ఈ పాత్రలో తెలుగులో నదియా నటించారు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో ఈ పాత్రలో హైదరాబాద్‌ సొగసరి టబూ నటించనున్నట్లు సమాచారం. ఈపాత్ర కోసం పలువురు బాలీవుడ్‌ వెటరన్‌ హీరోయిన్లను మొదట పరిశీలించినప్పటికీ టబూ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించిన చిత్ర యూనిట్‌ ఆమెను ఎంచుకుంది. అజయ్‌దేవగణ్‌ హీరోగా నటించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ